సినీ పరిశ్రమలో నాకు చాలా మంది వ్యతిరేకులున్నారు : హీరోయిన్
ఉద్దేశపూర్వకంగా వారు వివాదాల్లోకి వెళ్తారా..? వివాదాలే వాళ్లను వెంటాడుతాయా..? అన్నట్టుగా ఉంటారు కొందరు సెలెబ్రిటీలు. ఇలాంటి వారిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్. తన ప్రకటనలతో వివాదాస్పదం అవుతూ నిత్యం వార్తల్లో ఉంటుంది. సుశాంత్ సింగ్ మరణం అంశం.. తర్వాత మహారాష్ట్ర సర్కారుతో వైరం.. తాజాగా రైతుల ఉద్యమానికి వ్యతిరేకంగా కామెంట్లు.. ఇలా తరచూ భిన్నమైన వ్యాఖ్యలు చేస్తూ వివాదాలకు కేంద్ర బిందువు అవుతోంది కంగనా రనౌత్. ఈ విషయమై తాజాగా ఓ ప్రకటన చేసింది.
నేను నిజాయితీగా ఉంటా..
చిత్రపరిశ్రమ గురించి కావొచ్చు.. ఇతర విషయాల గురించి కావొచ్చు తాను నిజాయితీగానే మాట్లాడతానని చెబుతోంది రనౌత్. ‘‘నేను రిజర్వేషన్లను వ్యతిరేకించాను.. చాలా మంది హిందువులు తిట్టారు. నేను ఇస్లాం వాదులను వ్యతిరేకిస్తాను.. అందుకే ముస్లింలు నన్ను ద్వేషిస్తారు. నేను ఖలిస్తానీలతో పోరాడాను.. కాబట్టి ఇప్పుడు సిక్కులు నాకు వ్యతిరేకంగా మారారు. అసలు నేనేం చేస్తున్నాను.. ఎందుకు చేస్తున్నాను అని చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ.. ఈ ప్రపంచాన్ని మించిన, నా ప్రపంచంలో నా మనస్సాక్షి నన్ను ఎప్పుడూ ప్రశంసిస్తూనే ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది.
‘తలైవి’ ముగింపులో..
కంగనా నటిస్తున్న తాజా మూవీ ‘తలైవి’ షూటింగ్ ఇటీవల పూర్తయింది. ఈ సందర్భంగా భావోద్వేగ ప్రకటన ఒకటి చేసిందీనటి. ‘‘జయలలిత వంటి నాయకురాలి పాత్రలో నటించడం జీవిత కాల అవకాశంగా భావిస్తున్నా. ఈ చిత్రీకరణ త్వరగా ముగియడం బాధగా ఉంద’’ని చెప్పింది. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా నటిస్తుండగా.. ఎంజీఆర్ గా అరవింద్ స్వామి, కరుణానిధిగా ప్రకాష్ కనిపించనున్నారు. విజయ్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం అనంతరం నటించే మూవీలో కంగనా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలెట్ గా కనిపించనున్నారు.