సర్కార్ కు సపోర్ట్ గా స్టార్ హీరో ట్వీట్!

Update: 2018-11-28 04:49 GMT
మురుగదాస్ - విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'సర్కార్' బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది.  కాకపోతే విజయ్ గత చిత్రాల లాగానే ఈ సినిమా కూడా పలు వివాదాలలో చిక్కుకుంది.  కథ వివాదం పక్కన బెడితే ఈ సినిమాలో కొన్ని డైలాగులు ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పథకాలను విమర్శించేవి గా ఉన్నాయి.  దీంతో తమిళనాడు ప్రభుత్వం దర్శకుడు మురుగదాస్ పై కేసులు బుక్ చేసింది.  దీనిపై  చాలారోజుల నుండి హంగామా జరుగుతోంది.

ఇదిలా ఉంటే కమల్ హాసన్ తాజాగా సర్కార్ ఇష్యూ పై ట్వీట్ చేశాడు.. "సీబీఎఫ్సీ ఆల్రెడీ సర్కార్ కు సర్టిఫికేట్ ఇచ్చింది. అయినా గవర్నమెంట్ మాత్రం ప్రజల భావ వ్యక్తీకరణ హక్కు విషయంలో జోక్యం చేసుకుంటోంది.  ఇది ప్రజాస్వామ్యం కాదు. నియంతృత్వాన్ని గతంలో ఓడించారు.. మరోసారి ఓడిస్తారు. @ఎఆర్ మురుగదాస్".  'సర్కార్' ఇష్యూ పై ఇప్పటివరకూ మాట్లాడని కమల్ సడెన్ గా ఇప్పుడెందుకు మాట్లాడాడని కొంతమందికి అనుమానం రావచ్చు.

విషయం ఏంటంటే.. మురుగదాస్ ఈ కేసుల నుండి బెయిల్ కోసం అప్లై చేస్తే హైకోర్టులో గవర్నమెంట్ తరపు న్యాయవాది మురుగదాస్ ను గవర్నమెంట్ కు క్షమాపణ చెప్పాలని.. భవిష్యత్తులో ప్రభుత్వాన్ని.. ప్రభుత్వ పథకాలను నెక్స్ట్ సినిమాలలో విమర్శించనని లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని కోరారట. దీనికి మురుగదాస్ 'నో' చెప్పాడని అయన తరపు న్యాయవాది వివేక్ రత్నం వెల్లడించారు.  అంతే కాదు అసలు మురగదాస్ ఎందుకు ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలో కూడా తెలపాలని.. అసలు మురుగదాస్  చేసిన తప్పేంటో తెలపాలని ఆయన అంటున్నారు.  ఈ సందర్భంలోనే కమల్ మురుగదాస్ కు మద్దతుగా ట్వీట్ చేశారు.
 
Tags:    

Similar News