రాజ‌కీయాల్ని మార్చే టైమ్ ఇదే!- క‌మ‌ల్‌ హాస‌న్‌

Update: 2018-08-02 17:40 GMT
తాను రాజ‌కీయాల్లోకి రావాల‌నుకోవ‌డానికి కార‌ణం ఈ వ్య‌వ‌స్థ‌లో పేరుకుపోయిన కుళ్లును తీసిపారేయ‌డ‌మేన‌ని, త‌న‌వంతు ప్ర‌య‌త్నం చేసేందుకే పూర్తిగా రాజ‌కీయాల్లోకి దిగుతున్నాన‌ని ప్ర‌క‌టించారు క‌మ‌ల్ హాస‌న్. మ‌క్క‌ల్ నీది మ‌య్యం (ఎంఎన్ ఎం)  పార్టీ పెట్టిన‌ప్పుడు ఆయ‌న అన్న మాట ఇది. ఇక `విశ్వ‌రూపం 2` ప్ర‌మోష‌న్ కోసం హైద‌రాబాద్ విచ్చేసిన ఆయ‌న్ని రాజ‌కీయాల్లోకి పూర్తిగా దిగిన‌ట్టేనా? అని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

అవును ఇక రాజ‌కీయాల్లోకి పూర్తిగా దిగిపోయాను. ఈ రంగంలోనూ న్యాయం చేస్తాను.. అని వ్యాఖ్యానించారు. రాజ‌కీయాల్లోకి వ‌చ్చాను కాబ‌ట్టి ఇక పూర్తిగా ప్ర‌జ‌ల్లోకి వెళ‌తున్నాన‌ని తెలిపారు. రాజ‌కీయ నాయ‌కులు ఎవ‌రైనా ఏదైనా త‌ప్పుగా మాట్లాడినా .. అది మాకు క‌లిసొస్తుంది. ప్ర‌శ్నించేందుకు ఆస్కారం దొరుకుతుంది. త‌ప్పుడు రాజ‌కీయాల్ని మీడియా ప్ర‌శ్నించాలి. మీరు ప్ర‌శ్నించ‌డం వ‌ల్ల‌నే సిస్ట‌మ్‌ ని మార్చేందుకు ఆస్కారం ఉంటుంది. ఇక‌మీద‌ట ఏం చేసినా మీడియానే చేయాలి. రాజ‌కీయాల్ని మార్చాలంటే అంతా క‌లిసిక‌ట్టుగా రావాల‌ని క‌మ‌ల్ అన్నారు. ఓ ర‌కంగా మీడియా అండ ఉంటే తాను ఏదైనా సాధించ‌గ‌ల‌న‌నే అభిప్రాయం ఆయ‌నలో వ్య‌క్త‌మైంది.
Tags:    

Similar News