‘డు ఆర్ డై’ అంటున్న కల్యాణ్ రామ్
హీరో కల్యాణ్ రామ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి చాలా కాలమైంది. ‘పటాస్’ తర్వాత ఆ స్థాయి హిట్ రిపీట్ చేసేందుకు నందమూరి హీరో సీరియస్ గా ట్రై చేస్తున్నాడు. గతంలో కెవి గుహన్ డైెరెక్షన్ లో వచ్చిన ‘118’.. సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత వచ్చిన ‘ఎంత మంచివాడవురా’ యావరేజ్ గానే మిగిలిపోయింది. ఈ రెండు చిత్రాల తర్వాత కల్యాణ్ రామ్‌ను ప్రేక్షకులు చూడలేదు.
ప్రస్తుతం కొత్త దర్శకుడు వశిష్టతో ఓ మూవీ చేస్తున్నాడు కల్యాణ్ రామ్. భారీ బడ్జెట్ తో తెరకెక్కతున్న ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొట్టాలనే లక్ష్యంతో ఉన్నాడు. అయితే.. లేటెస్ట్ గా మరో న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం వశిష్ట డైరెక్షన్ లో రూపొందుతున్న చిత్రంతోపాటు మరో చిత్రంలో కూడా నటించడానికి కల్యాణ్ రామ్ సిద్ధమయ్యాడు. అది కూడా ప్రెస్టేజియస్ బ్యానర్ అయిన దిల్ రాజ్ ప్రొడక్షన్ లో చేయబోతున్నాడు.
దిల్ రాజు నిర్మించబోతున్న మూవీకి "డు ఆర్ డై" అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న చిత్రానికి సమాంతరంగా ఈ చిత్రాన్ని షూట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అన్నీ కుదిరితే.. కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ మూవీ కన్నా ముందుగా దిల్ రాజు చిత్రమే విడుదల చేస్తారట.
ఈ రెండు చిత్రాలే కాకుండా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కూడా కల్యాణ్ రామ్ ఒక సినిమా చేయబోతున్నట్టు సమాచారం. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. ఈ విధంగా నందమూరి నటుడు రాబోయే కొత్త సంవత్సరంలో వరుస ప్రాజెక్టులతో చాలా బిజీకాబోతున్నాడు.