అజయ్ పై కాజోల్ ఫస్ట్ ఇంప్రెషన్ అదా..?

Update: 2023-04-03 06:00 GMT
బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ అంటే ఇండియా వైజ్ సూపర్ ఫ్యాన్స్ ఉన్నారు. తన సినిమాలతో ఎంతోమంది ప్రేక్షక హృదయాలను కొల్లగొట్టిన కాజోల్ బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 1999లో వీరి వివాహం జరిగింది.

అజయ్ తో ప్రేమ గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది కాజోల్. అజయ్ ని ఫస్ట్ టైం హల్ చల్ సెట్ లో కలిశానని చెప్పిన కాజోల్ మొదటిసారి చూసినప్పుడు తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదని చెప్పారు.

హల్ చల్ సినిమా మొదటిరోజు నిర్మాత తన దగ్గరకు వచ్చి అతనే హీరో అని అజయ్ ని చూపించి చెప్పారట. అజయ్ ఒక మూలన కూర్చీలో కూర్చుని ఉన్నాడట. అతన్ని చూసి నిజమా అతనేనా హీరో అని అడిగిందట కాజోల్.

ఏదైనా చెప్పలనుకున్నప్పుడు మాత్రమే అజయ్ మాట్లాడతాడని అప్పుడే గుర్తించానని అన్నారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం.. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ అజయ్ తో తన లవ్ మ్యారేజ్ పై కాజోల్ చెప్పుకొచ్చారు.

హల్ చల్ సినిమా 1995లో రిలీజైంది. ఆ సినిమాతోనే వీరిద్దరి పరిచయం ఏర్పడి ప్రేమ పెళ్లి దాకా వెళ్లింది. అజయ్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరోలందరితో కాజోల్ సూపర్ హిట్ సినిమాలు చేసింది. అజయ్ దేవగన్ కూడా తన స్టార్ డం కొనసాగిస్తూ వచ్చారు. ఆర్.ఆర్.ఆర్ లో అజయ్ అల్లూరి వెంకట రామ రాజు పాత్రలో నటించారు.

లేటెస్ట్ గా బాలీవుడ్ లో అజయ్ భోలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేసిన ఖైదీ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమాలో నటించడమే కాదు దర్శక నిర్మాతగా కూడా అజయ్ మెప్పించారు. యావరేజ్ టాక్ వచ్చినా సినిమా చిన్నగా హిట్ వైపుకి దూసుకెళ్తుంది. ఈ సినిమాలో టబు, దీపక్ డోబ్రియాల్, గజరాజ్ రావు నటించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News