'ఉమా'గా కాజల్ కొత్తచిత్రం.. పెళ్లి తర్వాత ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్..!

Update: 2021-06-26 05:30 GMT
దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్.. గతేడాది లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకొని సోలో లైఫ్ కు ఫుల్ స్టాప్ పెట్టేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాజల్ భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి దాంపత్య జీవితంలోని తీపిని రుచి చూస్తోంది. అయితే కాజల్ పెళ్లి చేసుకుంది బయటి వ్యక్తిని మాత్రం కాదు. చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లును పెళ్లి చేసుకొని అందరికి సర్ప్రైజ్ ఇచ్చింది. మరో ట్విస్ట్ ఏంటంటే.. వీరిద్దరూ కొన్నేళ్లుగా డేటింగ్ చేశాకే పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆనందించే విషయం మాత్రం పెళ్లయ్యాక సినిమాలు చేయడం ఆపకపోవడమే. ప్రస్తుతం అమ్మడు పెళ్లికి ముందు పెళ్లి తర్వాత లైఫ్ డిఫరెంట్ గా ఉందని అంటోంది.

ఇంతకీ ఈ పెళ్లి గోల ఇప్పుడెందుకు అనుకుంటున్నారా.. కాజల్ అగర్వాల్ తాజాగా పెళ్లి నేపథ్యంలోనే భారీ స్థాయి సినిమా ఓకే చేసింది. పెళ్లి అనేది ఊహల జీవితానికి నిజ జీవితానికి మధ్య తేడాను చూపించే విధంగా సినిమా ప్లాన్ చేశారట. ఉమా అనే అమ్మాయి కారణంగా పెళ్లి ఇంట్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయనే స్టోరీతో డైరెక్టర్ స్క్రిప్ట్ రెడీ చేసాడు. పెళ్లి తర్వాత కాజల్ ఓకే చేసిన ఫస్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇది. కాజల్ ఉమా పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర పేరునే మేకర్స్ సినిమా పేరుగా ప్రకటించారు. ఉమా అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాను నూతన దర్శకుడు తతగత సింఘా డైరెక్ట్ చేయనున్నాడు.

మిరాజ్ గ్రూప్ బ్యానర్ పై అవికేష్ ఘోష్ - మంతరాజ్ పాలివాల్ సినిమాను నిర్మించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు సుజోయ్ ఘోష్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నాడు. అయితే ఇటీవలే కాజల్ అగర్వాల్ సినీ కెరీర్ లో 17 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. నటిగా ఎల్లప్పుడూ నన్ను సవాల్‌ చేసే పాత్రలతో పాటు వినోద్మాతక కథల్లో నటించడానికి నేను ఇష్టపడతాను. ‘ఉమ’ మూవీ కూడా అలాంటిదే. ఎప్పుడెప్పుడు సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.’’ అంటూ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పింది కాజల్. ఈ సినిమా ఏడాది చివరిలో ప్రారంభం కాబోతుందని సమాచారం. ఇదిలా ఉండగా ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ తో ఆచార్య - నాగ్ తో యాక్షన్ మూవీ చేస్తోంది.
Tags:    

Similar News