పుష్ప విల‌న్ మూవీ.. షేక్ స్పియ‌ర్ మ‌క్ బెత్ లా మిస్టీరియ‌స్

Update: 2021-04-02 12:59 GMT
మ‌ల‌యాళ క‌థానాయ‌కుల్లో ఫైనెస్ట్ స్టార్ గా పాపుల‌రైన ఫ‌హ‌ద్ ఫాజిల్ త్వ‌ర‌లోనే పుష్ప చిత్రంతో టాలీవుడ్ లో విల‌న్ గా అడుగుపెడుతున్న సంగ‌తి తెలిసిందే. అత‌డు న‌టించిన ట్రాన్స్ చిత్రానికి జాతీయ అవార్డుల ద‌క్క‌గా బెంగ‌ళూర్ డేస్ లాంటి సెన్సేష‌న‌ల్ హిట్ చిత్రంలోనూ న‌టించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు.

ఫహద్ న‌టించిన తాజా చిత్రం `జోజి` ఏప్రిల్ 7 న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ కి సిద్ధమైంది. OTT ప్రీమియర్ ముందు మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ ‌ను విడుదల చేశారు. రెండు నిమిషాల 37 సెకన్ల ట్రైలర్ జోజి (ఫహద్) ఇంట్లో జ‌రిగే స‌న్నివేశాల‌తో ప్రారంభమవుతుంది.

ఆ కుటుంబంలో ఏదో ఊహాతీత‌మైన‌ మిస్ట‌రీ. కుటుంబ సభ్యులంతా ఆ ఒక్క‌టీ మాట్లాడ‌కూడ‌ద‌న్న‌ది కండీష‌న్. కానీ అది ఏమిటి? అన్న‌ది స‌స్పెన్స్. కుట్ర ర‌హస్యంతో నిండిన ఈ ట్రైలర్ జోజి ప్రపంచంలోకి తీసుకెళ్ల‌డంలో స‌ఫ‌ల‌మైంది. అయితే ఈ సినిమా క‌థేమిటి? అన్న‌ది ఎక్క‌డా రివీల్ చేయ‌కుండా స‌స్పెన్స్ లో ఉంచారు.

మహేషింతే ప్రతీకారం త‌ర్వాత  ఫజీద్ తో ద‌ర్శ‌కుడు దిలేష్ పోథన్ కి రెండో సినిమా ఇది. గత ఏడాది అక్టోబర్ లో జోజీని ప్రకటించినప్పుడు షేక్ ‌స్పియర్ ప్రసిద్ధ విషాద డ్రామా `మాక్ ‌బెత్` నుండి ప్రేరణ పొందిన ట్యాగ్ లైన్ ను కూడా మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రం మాక్ ‌బెత్ త‌ర‌హా అని బ‌హిరంగంగానే వెల్ల‌డించారు.

ఫహద్ ప్రధాన పాత్రలో నటించగా.. బాబీరాజ్- ఉన్నిమయ ప్రసాద్- షమ్మీ తిలకన్- అలిస్టర్ అలెక్స్- బాసిల్ జోసెఫ్ కూడా జోజీ లో నటించారు. ఈ చిత్రానికి జస్టిన్ వర్గీస్ సంగీతం ఇవ్వగా- కిరణ్ దాస్ ఎడిటింగ్ అందిస్తున్నారు.

దురాశ.. కోరిక.. హత్య.. రహస్యాల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే  క్రైమ్ డ్రామా జోజి. ధనిక రైతుల కుటుంబంలో చిన్న కుమారుడిగా కనిపించే జోజి పాత్రను ఫహాద్ పోషిస్తున్నారు. జోజీ ఒక ఇంజనీరింగ్ డ్రాపౌట్.. అతను ధనవంతుడైన ఎన్నారై కావాల‌ని క‌ల‌లుగంటాడు.  కాని అతని తండ్రి ఈ ఆలోచనకు మద్దతు ఇవ్వడు. అతనిని ఒక వైఫల్యంగా చూస్తాడు. కుటుంబంలో అపూర్వమైన సంఘటనలు జరిగినప్పుడు.. జోజి తన ప్రణాళికలను ఎలా అమలు చేస్తాడో ఈ చిత్రం వెల్ల‌డిస్తుంది.

ఇదేగాక‌..ఫహద్ న‌టించిన సినిమాలు వ‌రుస‌గా రిలీజ్ ల‌కు రెడీ అవుతున్నాయి.  రాజేంద్రన్.. సౌబిన్ షాహిర్ లతో కలిసి ప‌ని చేసిన‌ ఇరుల్ శుక్రవారం నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది.  మహేష్ నారాయణన్ దర్శకత్వం వహించిన పొలిటికల్ థ్రిల్లర్ మాలిక్ విడుదల కోసం వెయిటింగ్. ఫహద్ ప్రస్తుతం మలయనుంజు చిత్రీకరణలో ఉన్నాడు. ఆ చిత్రంలో అతను రాజీషా విజయన్ తో కలిసి కనిపించనున్నాడు. అలాగే బ‌న్ని న‌టిస్తున్న పుష్ప‌లో ప్ర‌ధాన విల‌న్ గా న‌టించ‌నున్నారు.

Full View
Tags:    

Similar News