సూప‌ర్ స్టార్ మూవీలో జ‌గ్గూ భాయ్‌ గ్రాండ్ వెల్కం చెప్పిన యూనిట్‌!

Update: 2021-03-17 10:57 GMT
టాలీవుడ్ జ‌గ్గూభాయ్ మ‌రోసారి త‌మిళ్‌ సూప‌ర్ స్టార్ చిత్రంలో న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే రెండు చిత్రాల్లో ర‌జ‌నీతో క‌లిసి న‌టించిన జ‌గ‌ప‌తిబాబు.. మూడో చిత్రంలోనూ మెరిసి ఆడియ‌న్స్ ను మురిపించ‌బోతున్నారు. ఈ మేర‌కు ప్ర‌ముఖ కోలీవుడ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ స‌న్ పిక్చ‌ర్స్.. గ్రాండ్ గా వెల్కం చెప్పింది.

ర‌జ‌నీకాంత్ అప్ క‌మింగ్‌ మూవీ 'అన్నాత్తే'! స్టార్ డైరెక్ట‌ర్ శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో మొద‌లైంది. చాలా వ‌రకు షూటింగ్ కూడా జ‌రిగింది. కానీ.. హైదరాబాద్ లో చిత్రీక‌ర‌ణ‌ జ‌రుగుతున్న స‌మ‌యంలో తీవ్ర అనారోగ్యానికి గురై, ఆసుప‌త్రిలోకి చికిత్స‌పొందిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత చెన్నైకి వెళ్లిపోయిన ర‌జ‌నీ.. అనంత‌రం రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇంటికే ప‌రిమితం అయిపోయారు.

మ‌ళ్లీ ఇన్నాళ్ల త‌ర్వాత ఈ మ‌ధ్య‌నే ద‌ర్శ‌కుడు శివ‌కు ఫోన్ చేసిన ర‌జ‌నీ.. షూటింగ్ స్టార్ట్ చేయాల‌ని సూచించాడ‌ట. దీంతో.. యూనిట్ మొత్తం సిద్ధ‌మైపోయింది. అతి త్వ‌ర‌లోనే సెట్స్ లో అడుగు పెడుతున్నారు త‌లైవా. అయితే.. ఈ సినిమాలో జ‌గ‌ప‌తి బాబు న‌టించ‌బోతున్నాడ‌న్న వార్త ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

చెన్నైలో మొద‌లు కాబోతున్న షూటింగ్ లో జ‌గ్గూభాయ్ పాల్గొంటాడ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కూ క‌థానాయ‌కుడు, లింగా చిత్రాల్లో ర‌జ‌నీతో క‌లిసి న‌టించారు జ‌గ‌ప‌తి బాబు. ఒక సినిమాలో ఆప్త‌మిత్రుడిగా, మ‌రో సినిమాలో విల‌న్ గా క‌నిపించారు. మ‌రి, ఈ సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నార‌నేది ఆస‌క్తి రేకెత్తిస్తోంది. న‌య‌న‌తార‌, కీర్తి సురేష్‌, మీనా, ఖుష్బూ వంటి భారీతార‌గ‌ణంతో సిద్ధ‌మ‌వుతున్న ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా న‌వంబ‌ర్ 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.
Tags:    

Similar News