'ఆదిపురుష్' లో సీత ఆమెనా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో బాలీవుడ్ లో నిర్మాణం కాబోతున్న భారీ ప్రతిష్టాత్మక మూవీ 'ఆదిపురుష్' ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ఉంది. బాలీవుడ్ తో పాటు అన్ని భాషల సినిమా పరిశ్రమల్లో కూడా ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గట్లుగా వందల కోట్ల బడ్జెట్ తో ఒక విజువల్ వండర్ మాదిరిగా ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో సీత పాత్రలో ఎవరు నటిస్తారు అనే విషయం చాలా రోజులుగా జరుగుతుంది. సీత పాత్రకు ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ అంటూ చాలా మంది పేర్లు ఇలా ప్రచారంకు వచ్చి అలా వెళ్లి పోయాయి. కాని కృతి సనన్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తూనే ఉంది.
ఇప్పటి వరకు కృతి సనన్ పేరు వార్తల్లో వస్తున్న నేపథ్యంలో యూనిట్ సభ్యులు కాని ఆమె కాని ఖండించేలా చిన్న ప్రకటన కూడా చేయలేదు. దాంతో ఆదిపురుష్ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యే సమయంకు ఆమె పేరునే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందేమో అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ ను వచ్చే నెలలో చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మరో వైపు ఈ సినిమా వీఎఫ్‌ఎక్స్ వర్క్ ప్రారంభం అయ్యిందని సమాచారం అందుతోంది. ప్రభాస్ రాముడిగా సైఫ్ అలీ ఖాన్ రావణుడిగా నటించబోతున్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.