• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  హలో.. అక్కడ కష్టంగానే...

హలో.. అక్కడ కష్టంగానే ఉంది

By - Tupaki Desk
Update: 2017-12-15 10:20 GMT
ఈ రోజుల్లో ఓవర్సీస్ మార్కెట్ అనేది తెలుగు సినిమాలకు కీలకంగా మారింది. అక్కడి ప్రేక్షకుల అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేయడం.. మార్కెట్ పెంచుకోవడం హీరోలకు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ మార్కెట్ ను దృష్టిలో పెట్టుకునే రామ్ చరణ్ లాంటి మాస్ హీరోలు కూడా క్లాస్ కథల వైపు అడుగులేశారు. ఇప్పుడు ఇండస్ట్రీలోకి కొత్తగా వస్తున్న హీరోలు కూడా ఓవర్సీస్ ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో ఉంచుకుని సినిమాలు ఎంచుకుంటున్నారు.

ఐతే అక్కినేని యంగ్ హీరో అఖిల్ మాత్రం తన తొలి సినిమా విషయంలో పెద్ద తప్పటడుగు వేశాడు. అరంగేట్రంలోనే ‘అఖిల్’ లాంటి మాస్ మసాలా సినిమా ట్రై చేశాడు. ఆ చిత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ దారుణంగా బోల్తా కొట్టింది. ఓవర్సీస్ బయ్యర్లు బాగా దెబ్బ తిన్నారు ఆ సినిమాకు. ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ‘హలో’ మీద కూడా పడేలా కనిపిస్తోంది. ఓవర్సీస్‌ లో మంచి రికార్డున్న విక్రమ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించినప్పటికీ అఖిల్ ట్రాక్ రికార్డు.. అతడికి ఓవర్సీస్ లో ఇంకా ఫ్యాన్ బేస్ ఏర్పడకపోవడం ప్రతికూలంగా మారుతోంది. ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో బజ్ రాలేదని అక్కడి ట్రేడ్ పండిట్లు అంటున్నారు. ప్రిమియర్స్ కు పెద్దగా టికెట్లు తెగకపోవచ్చని.. ఫస్ట్ వీకెండ్ ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు. ఈ సినిమా ట్రైలర్ కూడా అక్కడి వాళ్లకు అంతగా ఎక్కట్లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో ‘ఫిదా’కు చేసినట్లుగా రిలీజ్ ముంగిట క్లాస్ టచ్ ఉన్న మరో ట్రైలర్ వదలాలని నాగ్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఎలాగోలా ‘హలో’ ఓవర్సీస్ హక్కుల్ని రూ.3 కోట్లకు అమ్మేయగలిగారు కానీ.. ఇప్పుడా పెట్టుబడి రికవర్ చేసేలా ఈ చిత్రం మిలియన్ మార్కును అందుకుంటుందా అన్న గుబులు కనిపిస్తోంది. మరి ‘హలో’ ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.
Tags:    
  • Akhil 
  • Akkineni Akhil 
  • Akhil Hello Movie 
  • Hello Movie 
  • Telugu NEWs 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS