టాలీవుడ్ మళ్లీ పుంజుకోవాలంటే అలాంటి డెసిషన్స్ తీసుకోవాల్సిందేనా...?
సినీ ఇండస్ట్రీలో గత కొన్ని రోజులుగా 'నెపోటిజం' పై చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇది ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితం కాలేదు. మిగతా అన్ని ఇండస్ట్రీలలో కూడా హాట్ టాపిక్ అయింది. సినీ ఇండస్ట్రీలో బంధుప్రీతి ఎక్కువ ఉంటుందని.. దీని కారణంగా ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ లేకుండా అడుగుపెట్టిన వారికి అవకాశాలు రాకుండా చేస్తుంటారు అని.. నటవారసులకి మాత్రం టాలెంట్ తో సంబంధం లేకుండా ఛాన్సెస్ ఇస్తుంటారు అంటూ అనేక ఆరోపణలు వస్తున్నాయి. ఇది ఎప్పటి నుంచో ఉన్నదే అయినప్పటికీ ఇటీవల బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో ఒక్కసారిగా 'నెపోటిజం'పై అందరూ తమ వాయిస్ వినిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ లో కూడా ఇప్పుడు 'నెపోటిజం'పై చర్చిస్తున్నారు.
తెలుగు సినిమా మళ్లీ పుంజుకోవాలంటే.. ఇక్కడ ఉన్న నెపోటిజమ్ ని అంతం చేయాలని కామెంట్ చేస్తున్నారట. టాలీవుడ్ లో ఎక్కడ చూసినా.. ఎవ్వరని అడిగినా కూడా ఇదే మాట చెప్తున్నారట. తెలుగులో బాగా నెపోటిజం ఉందనేది ఎప్పటి నుంచో వస్తున్న మాట. ఇక్కడ దాదాపు స్టార్స్ అందరూ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో పైకి వచ్చిన వారే. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే మిగతా వారంత ఫిల్మ్ బ్యాగ్రౌండ్ తోనే సినిమాలు చేస్తున్నారు. మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ, అక్కినేని ఫ్యామిలీ, దగ్గబాటి ఫ్యామిలీ.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కుటుంబాలే ఉన్నాయి. టాలెంట్ ఉన్నా లేకున్నా అలాంటి వారికే ఆఫర్స్ వస్తుంటాయి.. వారి సినిమాలే ఏడాది పొడవునా రిలీజ్ అవుతుంటాయి. తెలుగు చిత్ర పరిశ్రమ బాగుపడాలంటే వారితో పాటు బ్యాగ్రౌండ్ లేకుండా టాలెంట్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టే వారిని కూడా ఎంకరేజ్ చేయాలని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.
అలానే పక్క భాషా కథలతో రీమేక్ లు చేస్తూ ఇక్కడ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న పరిస్థితులకి వెంటనే అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారట. ముఖ్యంగా రీమేక్ కథలకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇక్కడ ఉన్న లోకల్ టాలెంట్ ని ఇండస్ట్రీలోకి ఆహ్వానించాలని డిమాండ్ చేస్తున్నారట. అంతేకాకుండా వేరే భాషా కథల్ని రీమేక్ చేస్తే ఆ సినిమాలో మొత్తం తెలుగు వారినే పెట్టుకోవాలని సూచిస్తున్నారట. కన్నడ సీమలో మాదిరిగా డబ్బింగ్ సినిమాలను రిలీజ్ చేయకపోతే తెలుగు సినిమాలకి ప్రాధాన్యత పెరుగుతుందని అంటున్నారట. వీటిపై ముందు ఆలోచన చేసి ఆ తరువాత ఆర్టిస్టులు రెమ్యూనరేషన్ తదితర విషయాలు ఆలోచించి ముందుకు వెళితే మంచిదని సలహా ఇస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే ఈ రెండు నెలలుగా ఇండస్ట్రీకి జరిగన డ్యామేజ్ నుంచి కోలుకోగలమని ఇండస్ట్రీ పెద్దలంతా మాట్లాడుకుంటున్నారట. మరి ఇప్పటి నుంచైనా వాటి మీద దృష్టి పెడతారేమో చూడాలి.