• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వెంకీని వరుణ్ మ్యాచ్...

వెంకీని వరుణ్ మ్యాచ్ చేయగలడా?

By - Tupaki Desk
Update: 2018-12-13 08:38 GMT
సీనియర్ హీరో వెంకటేష్.. మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ కాంబినేషన్ లో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టి స్టారర్ 'F2'.  సంక్రాంతి కి రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ నిన్నే రిలీజ్ అయింది. సినిమా ఎంత కామెడీగా ఉండబోతోందో టీజర్ తో శాంపిల్  చూపించాడు దర్శకుడు.  

పెళ్ళికి ముందు మగవాళ్ళు ఏమనుకుంటారు.. పెళ్ళైన తర్వాత ఎం తెలుసుకుంటారు అనేది ఇద్దరు హీరోలు వెంకీ.. వరుణ్ పాత్రల ద్వారా చూపించాడు. అనుకున్నదంతా జరగదని.. ఊహించని ఝలక్కులతో 'వెంకీ ఆసన్' వెయ్యాల్సి వస్తుందని సింబాలిక్ గా చెప్పాడు. మొగుళ్ళుగా మగసమాజం పడుతున్న బాధలను ఫన్ కోసం  అనిల్ రావిపూడి. బాగానే వాడుకున్నాడు.  కాన్సెప్ట్ బాగుంది.. వెంకీ కామెడీ టైమింగ్ సంగతి అందరికీ తెలిసిందే.  కామెడీ కి ఇంత స్కోప్ ఉన్న పాత్ర దొరికితే విశ్వరూపం చూపిస్తాడనడం లో ఏ మాత్రం సందేహం లేదు.  కానీ కామెడీ టైమింగ్ విషయం లో వెంకీ ని  వరుణ్ తేజ్ అందుకోగలడా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఇద్దరూ తోడల్లుళ్ళు కాబట్టి..  దాదాపు వెంకీ వరుణ్ కాంబినేషన్ లో ఎక్కువ కామెడీ సీన్స్ ఉండే అవకాశం ఉంది.  దీంతో వరుణ్ టైమింగ్ సరిగా లేకపోతే కామెడీ పండే అవకాశం తక్కువని వారి వాదన వినిపిస్తున్నారు. ఒకరకంగా ఆలోచిస్తే అదీ నిజమే కదా అనిపిస్తుంది.  వరుణ్ తన కెరీర్ లో ఇప్పటివరకూ అన్నీ సీరియస్ పాత్రల్లోనే నటించాడు.. కామెడీ కి స్కోప్ ఉన్న పాత్రలు చెయ్యలేదు.  పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'లోఫర్' సినిమాలో కాస్త కామెడీ టచ్ ఉంటుంది కానీ ఆ సీన్లలో పోసాని ఫుల్ గా డామినేట్ చేశాడు. ఇప్పుడు వెంకీ లాంటి సూపర్బ్ కామెడీ టైమింగ్ ఉన్న నటుడి తో కలిసి నటించే సమయంలో కనీసం 75% -  80% అయినా మ్యాచ్ చేస్తే గానీ ఆ సీన్లు పండే అవకాశం లేదు.

 మరి వెంకీ టైమింగ్ ను వరుణ్ అందుకోగలడా లేదా అనేది తెలియాలంటే మనం సంక్రాంతి వరకూ వేచి చూడాల్సిందే.  ఒకవేళ వరుణ్ వెంకీ ని మ్యాచ్ చేయగలిగితే మాత్రం సినిమా ప్రేక్షకులను ఫుల్ గా ఇంప్రెస్ చేయడం ఖాయమే .
Tags:    
  • F2 Movie 
  • Varun Tej 
  • Venkatesh 
  • Tollywood 
  • Telugu News 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS