ఫిలింన‌గ‌ర్ సెట్ లో అగ్ని ప్ర‌మాదం.. డీజిల్ లీక్ లో కార్ ధ‌గ్ధం..

Update: 2021-08-12 07:33 GMT
గురువారం ఉదయం ఫిల్మ్‌నగర్ లో సినిమా షూటింగ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. వివరాల్లోకి వెళితే ఆన్ లొకేష‌న్ చిత్రీక‌ర‌ణ‌లో పవర్ జనరేటర్ వాహనం నుండి ఆక‌స్మికంగా మంటలు చెలరేగాయి. ఈ మంట‌లు వేగంగా దావాన‌లంలా మారి కారు ద‌గ్ధ‌మైంది. సమీపంలోని దుకాణాలకు వ్యాపించింది. మంటల్లో కారు పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం.

సినిమా సిబ్బంది షూటింగ్ ఆపేసి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంత‌కుముందు ప‌లు సినిమాల‌ సెట్లు ఇలానే త‌గ‌ల‌బ‌డ్డాయి. అప్ప‌ట్లో హైద‌రాబాద్ ఔట‌ర్ లోని సైరా-న‌ర‌సింహారెడ్డి సెట్లు కాలి బూడిద‌య్యాయి. అన్న‌పూర్ణ స్టూడియోస్ లో అక్కినేని మూవీ `మ‌నం` కోసం వేసిన సెట్లు నిప్పంటుకుని త‌గ‌ల‌బ‌డ్డాయి. ఈ ఏడాది ఆరంభ‌మే ప్ర‌భాస్ ఆదిపురుష్ 3డి కోసం ముంబైలో సెట్లు వేయ‌గా అవి అగ్నికీల‌ల‌కు చిక్కుకున్నాయి. ఆన్ ది లొకేష‌న్ ఇలాంటి ప్ర‌మాదాలు త‌ర‌చుగా మాన‌వ త‌ప్పిదం.. అల‌క్ష్యం వ‌ల్ల చూడాల్సి వ‌స్తోంది. కొన్నిసార్లు షార్ట్ స‌ర్క్యూట్లు.. మ‌రికొన్నిసార్లు డీజిల్ లీకులు ఇంకా ఏవో కార‌ణాలు క‌నిపిస్తున్నాయి.





Tags:    

Similar News