మహేశ్ ఛేజింగ్ సీన్ కోసం ప్రాణాలకు తెగించాం!

Update: 2022-05-05 04:30 GMT
ఫైట్ మాస్టర్స్ గా రామ్ - లక్ష్మణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. టాలీవుడ్ సినిమాకి ఫైట్ మాస్టర్స్ ముంబై నుంచి ..  చెన్నై నుంచి  .. కన్నడ నుంచి  చాలామంది వచ్చారు. తమదైన మార్క్ చూపించడానికి ప్రయత్నించారు. ఇంత  పోటీని కూడా తట్టుకుంటూ రామ్ లక్ష్మణ్ ఇప్పటివరకూ నిలబడ్డారు. ఇప్పటికీ మాస్ యాక్షన్ కి సంబంధించిన ఫైట్స్ కంపోజ్ చేయాలంటే రామ్ - లక్ష్మణ్  పేర్లను స్టార్ హీరోలు సూచిస్తూ ఉంటారు. తాజాగా వారు 'సర్కారివారి పాట' సినిమాకి పనిచేశారు. మహేశ్ బాబు హీరోగా పరశురామ్ రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 12వ తేదీన విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో  రామ్ - లక్ష్మణ్  మాట్లాడుతూ .. "పరశురామ్ గారు 'సర్కారువారి పాట' సినిమాకి చేయమని అడిగినప్పుడు, 'గీత గోవిందం' తరహాలో ఉంటుందేమోనని అనుకున్నాము. కానీ ఈ సినిమా కంటెంట్ పూర్తిగా డిఫరెంట్. ఇందులో 'ఒక్కడు' సినిమాకి మించిన యాక్షన్ ఉంటుంది. యాక్షన్ చుట్టూ ఒక ఎమోషన్ ఉంటుంది. అందువలన ఆడియన్స్ తాము మెచ్చుకునేలా హీరో ఫైట్ చేయాలను కోరుకుంటారు. అందుకు తగిన అవుట్ పుట్ ను మేము ఇచ్చాము.
Read more!

ఒక హీరోకి ఫైట్  కంపోజ్ చేయాలనుకున్నప్పుడు దాని వెనుక ఉన్న ఎమోషన్ ముందుగా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చూసుకుంటాము. ఫైట్ లోకి హీరో ఎంటరయ్యే తీరుతోనే ఆ సీన్ ను పైకి లేపడానికి ట్రై చేస్తాము. ఇంటర్వెల్ బ్యాంగ్ లో వచ్చే ఫైట్ సీన్ ను 'గోవా'లో చేయడం జరిగింది. మహేశ్ బాబుగారు చాలా అద్భుతంగా చేశారు. కచ్చితంగా ఆ ఫైట్ సీన్ ఈ సినిమాకి  హైలైట్ గా నిలుస్తుంది. మహేశ్ బాబుగారు ప్రతి క్షణం కొత్తదనాన్ని కోరుకుంటారు. అది ఎంత కష్టమైనా  దానిని ఆయన ఎంజాయ్ చేస్తారు.

 ఈ సినిమా సెకండాఫ్ లో ఒక ఛేజ్ సీన్ ఉంటుంది.  చాలా రిస్క్ తో కూడుకున్న ఛేజింగ్ అది.  20 ఏళ్ల మా కెరియర్లో మేము డిజైన్ చేసిన గొప్ప  ఛేజింగ్ సీన్ అది. ఆ సీన్ ను చూస్తున్నప్పుడు ఆడియన్స్ తప్పకుండా థ్రిల్ ఫీలవుతారు. ప్రాణాలకి తెగించి చేసిన  రిస్కీ ఫైట్ అది. చూసిన తరువాత మీరే చెబుతారు. ఈ ఛేజింగ్ ను కంపోజ్  చేసిన తీరు పట్ల మహేశ్ బాబుగారు కూడా ఆశ్చర్యపోయారు. సినిమా విడుదల తరువాత ఈ ఛేజింగ్ సినిమా గురించి అంతా  తప్పకుండా మాట్లాడుకుంటారు" అని చెప్పుకొచ్చారు.  
 


Full View
Tags:    

Similar News