ప్రభాస్ కోసం వందమంది కొత్తవాళ్లను ఓకే చేసిన డైరెక్టర్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో మోస్ట్ ఇంటరెస్టింగ్ మూవీ సలార్. ఈ మూవీతో ప్రభాస్ లోని వయోలెంట్ యాంగిల్ బయటికి తీయనున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ నీల్. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ ముగించుకున్న సలార్ మూవీ షూటింగ్ త్వరలో సెకండ్ షెడ్యూల్ ప్రారంభించనుంది. అయితే కేజీఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ - ప్రభాస్ కాంబినేషన్ పై సినీ ప్రేక్షకులలో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతుండటంతో సినిమాలో అన్ని భాషల నటులు నటిస్తారని తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సలార్ మూవీలో దాదాపు వందమంది కొత్త ఆర్టిస్టులు పరిచయం కాబోతున్నారు.
ఇదివరకే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అతని బృందం హైదరాబాద్, చెన్నైలో చాలామందిని ఆడిషన్స్ జరిపి.. పూర్తి స్క్రీనింగ్ తర్వాత సుమారు వందమందిని ఖరారు చేసినట్లు సమాచారం. ఈ లెక్కన సలార్ లో భారీ తారాగణమే కనిపించబోతుంది. ఈ సినిమాలో ప్రభాస్ మెకానిక్ పాత్రలో కనిపిస్తాడని టాక్. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ఈ సినిమాతో ఫస్ట్ టైం ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక కన్నడ నటుడు మధు గురుస్వామి సలార్ విలన్ పాత్రలో భయంకరంగా నటిస్తారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ప్రభాస్ సలార్ తో పాటు ఆదిపురుష్, నాగ్ అశ్విన్ తో సైంటిఫిక్ థ్రిల్లర్ సినిమాలు చేయనున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపిక పదుకొనే నటించనుంది. ఈ జులై 30న ప్రభాస్, పూజహెగ్డే నటించిన రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కాబోతుంది.