సూపర్ స్టార్ పై క్లాప్ కొడుతున్న డైరెక్టర్ బుచ్చిబాబు.. ఫోటో వైరల్!
ఉప్పెన సినిమాతో సినీదర్శకుడుగా మారాడు బుచ్చిబాబు సాన. స్టార్ డైరెక్టర్ సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన బుచ్చిబాబు ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. మెగాహీరో వైష్ణవ్ తేజ్, కృతిశెట్టిలను హీరోహీరోయిన్స్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ రూపొందించిన ఉప్పెన మూవీ బాక్సాఫీస్ దగ్గర విజయవంతంగా దూసుకుపోతుంది. అయితే ఉప్పెన సినిమాలో బుచ్చిబాబు దర్శకత్వంతో పాటు అతను రాసిన మాటలు కూడా బాగానే పేలాయి. మైత్రి మూవీస్ లాంటి బడా బ్యానర్ లో, దేవిశ్రీ ప్రసాద్ లాంటి సంగీతంతో ఉప్పెన కాస్ట్ కుదరడం అతని లక్ అని చెప్పాలి. ఇదిలా ఉండగా ప్రస్తుతం బుచ్చిబాబుకు సంబంధించి ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏంటంటే బుచ్చిబాబు డైరెక్టర్ సుకుమార్ దగ్గర ఆర్య-2 మూవీ నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నట్లు ఇదివరకే చెప్పాడు. అక్కడి నుండి 1నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం వరకు వర్క్ చేసాడు. అయితే తాజాగా బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్ గా క్లాప్ కొడుతున్న పిక్ నెట్టింట కంటపడింది. నేనొక్కడినే సినిమా షూటింగ్ లో భాగంగా బుచ్చిబాబు.. సూపర్ స్టార్ మహేష్ బాబు, హీరోయిన్ కృతిసనన్ లపై క్లాప్ కొడుతున్నాడు. సింపుల్ గా హాఫ్ హాండ్స్ చొక్కా, ప్యాంటు ధరించి కనిపిస్తున్నాడు బుచ్చిబాబు. ప్రస్తుతం ఉప్పెన విజయంతో తదుపరి సినిమాల గురించి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు బడా బ్యానర్స్ బుచ్చిబాబుతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి ఉప్పెన డైరెక్టర్ మరో సినిమా ఎప్పుడు ప్రకటిస్తాడో!