జక్కన్న సెంటిమెంట్ ని 'ఆచార్య' నిజం చేసిందా..?
సినీ ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్ కు కేరాఫ్ అడ్రస్. ముఖ్యంగా టాలీవుడ్ లో వీటిని బలంగా నమ్మేవారి శాతం ఎక్కువగా ఉంటుంది. అన్నింటికీ సెంటిమెంట్‌తో ముడిపెడుతూ ఉంటారు. అందులో కొన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ ఉంటే.. ఇంకొన్ని గుడ్ సెంటిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇక దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి మీద కూడా ఓ నెగిటివ్ సెంటిమెంట్ ఉంది.
జక్కన్నతో సినిమా చేసిన ఏ హీరో అయినా బ్లాక్ బస్టర్ అందుకుంటాడు.. కానీ ఆ వెంటనే పరాజయం చవిచూస్తారని ఇండస్ట్రీలో ఓ బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. ఇదే నిజమే అన్నట్లు ఇప్పటి వరకు రాజమౌళితో వర్క్ చేసిన ప్రతీ హీరో కూడా ఈ సెంటిమెంట్ కు బలయ్యారు.
భారీ విజయం తర్వాత మళ్లీ ఆ అంచనాలను అందుకోలేకపోవడమో.. లేదా నిజంగానే కంటెంట్ ప్రేక్షకులను అలరించలేకపోవడం వల్లనో సినిమాలు ప్లాప్ అవుతుంటాయి. అయినప్పటికీ అవి జక్కన్న సెంటిమెంటు ఖాతాలోకి వెళ్లిపోతుంటారు.
ఇప్పుడు లేటెస్టుగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రాజమౌళి నెగెటివ్ సెంటిమెంట్ నుంచి తప్పించులేకపోయారనే చర్చ మొదలైంది. దీనికి కారణం భారీ అంచనాలతో ఈరోజు శుక్రవారం విడుదలైన ''ఆచార్య'' సినిమాకు మిశ్రమ స్పందన రావడమే అని తెలుస్తోంది.
ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి 'ఆర్.ఆర్.ఆర్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి తో కలిసి ''ఆచార్య'' సినిమాతో వచ్చాడు చరణ్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు నెగెటివ్ రిపోర్టులు వస్తున్నాయి.
కొరటాల శివ కెరీర్ లో ఇది చాలా బలహీనమైన కథ అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. చిరు - చరణ్ కలిసి నటించినా.. సినిమాలో భావోద్వేగాలు పండకపోవడంపై ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. మెగా తండ్రీకొడుకుల వరకు గొప్పగానే చెబుతున్నా.. బాక్సాఫీస్ వద్ద నిలబడటం కష్టమే అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
దీనిని బట్టి 'ఆచార్య' సినిమా మరోసారి జక్కన్న సెంటిమెంటును నిజం చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. నిజానికి మెగా ఫ్యాన్స్ ముందు దీని గురించి భయపడ్డారు. కానీ మెగాస్టార్ మాత్రం ఈ సెంటిమెంటును బ్రేక్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
'ఆచార్య' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి సెంటిమెంటు గురించి మాట్లాడిన చిరంజీవి.. 'ఆచార్య' సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందన్నారు.. బ్యాడ్ సెంటిమెంట్ ను అధిగమిస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు పబ్లిక్ టాక్ మరి రివ్యూలు చూస్తుంటే ఫలితం మరోలా ఉందనిపిస్తోంది.
గతంలో రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ 'మగధీర' వంటి భారీ విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత 'ఆరెంజ్' చిత్రంతో డిజాస్టర్ చవిచూశారు. ఇప్పుడు RRR తర్వాత వచ్చిన 'ఆచార్య' సినిమాను కూడా ఈ సెంటిమెంటు వెంటాడిందని సినీ అభిమానులు అంటున్నారు. కాకపోతే దీని వల్ల మెగాస్టార్ కూడా బలైపోయారని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమాపై అందరి దృష్టి పడింది. కొరటాల శివ దర్శకత్వంలో NTR30 మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమా పరిస్థితి ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నారు. అలానే రాజమౌళి తో వర్క్ చేయనున్న మహేష్ బాబు తదుపరి సినిమా గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అది కూడా కొరటాలతో ఉండే అవకాశం ఉందని టాక్. ఇదే నిజమైతే యాదృచ్చికంగా జక్కన్న తో వర్క్ చేసిన హీరోల నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కొరటాలతోనే చేస్తున్నారటన్నమాట.