19ఏళ్ల హీరోయిన్ కావాలా? 50 ప్ల‌స్ హీరోలపై న‌టి హేళ‌న‌

Update: 2020-12-17 11:30 GMT
చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో పురుషాధిక్యాన్ని ప్ర‌శ్నించే నాయిక‌లు పెర‌గుతున్నారు. ఇటీవ‌ల మీటూ ఉద్య‌మం ప‌ర్య‌వసానం నెమ్మ‌దించి సాలిడ్ రిజ‌ల్ట్ ని తేలేక‌పోయినా కానీ.. ఒక్కో గొంతు వినిపించ‌డం అయితే ఆగ‌లేదు. ఇక పురుషాధిక్యం.. హీరోయిజం కోసం పాకులాడే ఏజ్డ్ హీరోల్ని  తూల‌నాడుతూ దియా మీర్జా చేసిన కామెంట్ వైర‌ల్ గా మారింది.

హీరోల వ‌య‌సుతో పోలిస్తే హీరోయిన్ల ఏజ్ చాలా చిన్న‌దిగా ఉంటున్న వైనాన్ని దియా తాజా ఇంటర్వ్యూలో ప్ర‌శ్నించారు. 19ఏళ్ల అమ్మాయితో 50 ప్ల‌స్ ఏజ్ హీరో రొమాన్సా? అమ్మాయిల‌తో ముస‌లాళ్ల ప‌రాచికాలేమిటి? అంటూ కాస్త సూటిగానే ప్ర‌శ్నించిన దియా ఇది దుర‌దృష్ట‌క‌రం అని కూడా ఖండించారు. లేట్ ఏజ్ లో త‌మ స‌ర‌స‌న న‌టించాల్సిందిగా యువ నాయిక‌ల్ని ఏ విధంగా హీరోలు అడుగుతారు? అంటూ ప్ర‌శ్నించారు.

సీనియ‌ర్ న‌టీమ‌ణులు త‌మ‌కు అవ‌కాశాలివ్వాల్సిందిగా ప్రాధేయ‌ప‌డాల్సి వ‌చ్చింద‌ని కూడా ఈ సంద‌ర్భంగా గుర్తు చేసిన దియా మీర్జా అందుకు నీనా గుప్తాని ఉద‌హ‌రించారు. 50 ఏళ్ల ప్లస్ మేల్ నటుడు 19 ఏళ్ల నటితో రొమాన్స్ చేయడం ‘వింత’ అని దియా మీర్జా అన్నారు. తమ న‌ట జీవితాన్ని పొడిగించుకోవడానికి యువతుల సరసన నటించాలన్న వృద్ధుల ఆసక్తిని ఆమె ఎగతాళి చేసారు. నీనా గుప్తా లాంటి సీనియర్ నటి తన వృత్తిని ప్రేమిస్తున్నానని అవ‌కాశాల కోసం అడుక్కోవాల్సి వ‌చ్చింద‌ని దియా వెల్ల‌డించారు. మ‌గాళ్ల కోసం క‌థ‌లు రాస్తారు కానీ ఆడాళ్ల కోసం క‌థ‌లు రాయ‌రు అని కూడా రోపించారు దియా. మధ్య వయస్కులైన నటీమణులు చాలా మంది కష్టపడుతున్నారని అవ‌కాశాలివ్వ‌డం లేదని.. ఎందుకంటే ఏ కథలోనూ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు వారికి చోటు కల్పించడం లేదని సూటిగా విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.
Tags:    

Similar News