కొంపదీసి దేవిశ్రీ అదే ఆలోచనలో ఉన్నాడా..?
టాలీవుడ్ రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కుతాడని అందరూ భావిస్తున్నారు. అయితే దేవి పెళ్లి వార్త కొత్తదేం కాదు చాలా ఏళ్లుగా వినిపిస్తుంది. అయితే ప్రతిసారి నో అని కొట్టిపారేసిన దేవిశ్రీ ఈసారి నిజంగానే పెళ్లికి రెడీ అయినట్లు వార్తలు కాస్త బలంగా వినిపిస్తున్నాయి. ఇదివరకే గతంలో ఒక ప్రముఖ హీరోయిన్ తో ప్రేమాయణం నడిపినట్లుగా.. ఆ ప్రేమ కాస్త పెళ్లి వరకు దారితీసినట్లు వార్తలు వచ్చాయి. కాని అవి పుకార్లే అని తేల్చేసాడు దేవి. తాజాగా మరోసారి దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ఇక దేవిశ్రీ ప్రేమ పెళ్లి విషయంలో హీరోయిన్ ఛార్మి కూడా ఒకరు. ఆమెతో కాదని తెలిసాక ఇటీవలే రంగస్థలం ఫేమ్ పూజిత పొన్నాడతో పెళ్లి అని సినీ వర్గాలలో భారీ చర్చలు జరిగాయి. అయితే పూజితతో పెళ్లి కూడా పుకారు అని తేల్చేసారు దేవి. అయితే ప్రస్తుతం దేవి వయసు 40ఏళ్ళు. ఇప్పటికి దేవి బ్యాచిలర్ గానే ఉన్నారు. నిజానికి దేవి సినీ ఇండస్ట్రీకి వచ్చి 20ఏళ్ళు గడిచాయి.
కానీ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్లు గా దూసుకెళ్తున్నారు దేవిశ్రీ అండ్ తమన్. ఇండస్ట్రీలోకి ఆలస్యంగా వచ్చిన తమన్ పెళ్లి చేసుకొని ప్రస్తుతం హ్యాపీగా సినిమాలు చేసుకుంటున్నాడు. ఇంకా తమన్ కి ఓ కొడుకు కూడా ఉన్నాడు. కానీ దేవికి ఇంతవరకు పెళ్లి చూపులు కూడా కాలేదు. ఇంట్లో అడిగినా పెళ్లి విషయాన్నీ దాటేస్తున్నాడట దేవి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దేవి తన పెళ్లి పై స్పందించాడు. అన్నీ ప్రశ్నలకు నవ్వుతూ బదులిచ్చిన దేవి.. పెళ్ళెప్పుడు అనేసరికి నీరుగారిపోతున్నాడట. మీరు ఏమడిగినా చెప్తా కానీ పెళ్లి గురించి మాత్రం అడగకండి అంటూ సింపుల్ గా తప్పించుకుంటున్నాడట. మరి ఎందుకు దేవి పెళ్లి పై పెదవి విప్పట్లేడు అని అందరికి డౌట్. ఇదిలా ఉండగా దేవి తమ్ముడు సాగర్ కూడా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరి ఎందుకని దేవి తప్పించుకుంటున్నాడు? ఏదైనా సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్నాడా.. లేక కొంపదీసి సల్లు భాయ్ లాగా సోలోగానే మిగిలిపోయే ఆలోచనలో ఉన్నాడా అని ఫ్యాన్స్ సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి త్వరలో ఏదైనా తీపి కబురు వినిపిస్తాడేమో..!