గుమిగూడి మీద‌ప‌డిన‌ జ‌నం.. మార‌ని దీపిక రెబల్ యాటిట్యూడ్

Update: 2021-02-27 09:56 GMT
ముంబైలో ఓ రెస్టారెంట్ లో తిన‌డానికి వెళ్లిన స్టార్ హీరోయిన్ దీపిక ప‌దుకొనేని భారీ గుంపు ఎటూ క‌ద‌లనివ్వ‌కుండా బ్లాక్ చేయ‌డం వేడెక్కించింది. అంతేకాదు.. ఆ గుంపులోంచి ఒక మ‌హిళ దీపిక ప‌దుకొనే ప‌ర్సు(బ్యాగ్‌)ను ప‌ట్టుకుని లాగేస్తుండ‌డం తాజాగా ఓ వీడియోలో బ‌య‌ట‌ప‌డింది.

అయితే అంత జ‌రుగుతున్నా దీపిక మాత్రం ఎక్క‌డా త‌న చిరున‌వ్వును చెర‌గ‌నివ్వ‌లేదు. ఎంతో బ్యూటిఫుల్ స్మైల్ ఇస్తూ అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు సెక్యూరిటీ సాయం తీసుకుంది. మాబ్ బాగా ఇబ్బంది పెట్టేయ‌డంతో సిబ్బంధి చాలానే శ్ర‌మించాల్సొచ్చింది. ఆ గుంపులో అభిమానులు దీపిక‌ను వ‌దిలి పెట్టేందుకు ఏమాత్రం ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం క‌నిపించింది.

అన్న‌ట్టు రెస్టారెంట్ కి వెళుతూ దీపిక రెబ‌లిజం కూడా బ‌య‌ట‌పెట్ట‌డం క‌నిపించింది. తాను ఫ్యాషన్ ఇండ‌స్ట్రీ క్వీన్ అని మ‌రోమారు నిరూపించింది. ట్రెండీ యాటిట్యూడ్ విష‌యంలో దీపిక ఏమాత్రం త‌గ్గ‌దు అని త‌న లుక్ చూస్తే ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. ఇక దీపిక న‌టించిన 83 త్వ‌ర‌లో రిలీజ్ కానుంది. భ‌ర్త ర‌ణవీర్ న‌టించిన‌ ఈ చిత్రానికి స‌హ‌నిర్మాత‌గానూ దీపిక వ్య‌వ‌హ‌రిస్తోంది. దీంతో పాటు ప్ర‌భాస్ స‌ర‌స‌న నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ మూవీకి దీపిక సంత‌కం చేసింది. ప‌లు క్రేజీ చిత్రాల లైన‌ప్ తో దీపిక ఫుల్ బిజీగా ఉంది.
Tags:    

Similar News