మ‌న నిర్మాత‌ల‌కు మహమ్మారి మేలు అంతా ఇంతా!

Update: 2020-06-22 04:15 GMT
 మహమ్మారి వ‌ల్ల క‌ష్టాలు వ‌చ్చాయ‌ని అంతా అనుకుంటున్నారు క‌దా?.. అయితే తిప్ప‌లు పెట్టినా కానీ కొన్ని కోణాల్లో  మహమ్మారి చేసిన మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మ‌హ‌మ్మారీ మ‌నిషి మైండ్ సెట్ నే మార్చేస్తోంది. మ‌నిషి ఒదిగి ఉండ‌డ‌మెలానో నేర్పిస్తోంది.

ముఖ్యంగా సినీఇండ‌స్ట్రీని పెద్ద రేంజులోనే దెబ్బ తీసింద‌ని అంతా అంటున్నారు కానీ.. ఈ ప‌రిశ్ర‌మ‌కు  మహమ్మారి చేసిన మేలు అంతా ఇంతా కాదన్న విశ్లేష‌ణ సాగుతోంది. అయినదానికి కానిదానికి విదేశీ షూటింగులు ఎగ్జోటిక్ లొకేష‌న్లు అంటూ నిర్మాత జేబు గుల్ల చేసేసేవారు ఇంత‌కుముందు. అవ‌స‌రం లేక‌పోయినా మ‌న క‌థ‌ల‌న్నీ విదేశాల‌కు వెళ్లిపోయేవి. ఇక క‌థా చ‌ర్చ‌ల కోసం విదేశాల‌కు వెళ్లే క‌ల్చ‌ర్ ఓ రేంజులోనే నిర్మాత‌కు బొప్పి క‌ట్టించేది. కానీ ఇప్పుడా సోకులేవీ లేవు.

 మహమ్మారి దెబ్బ‌కు అంతా దిగొచ్చారు. విదేశాల‌కు వెళ్లాలంటేనే బెంబేలెత్తుతున్నారు. ప‌ర్య‌వ‌సానంగా అందుబాటులో ఉన్న‌ విశాఖ బీచ్ నే థాయ్ లాండ్ బీచో.. బ్యాంకాక్ బీచ్ అనో ఫీల‌వుతున్నార‌ట‌. అలాగే అర‌కు లోయ‌నే ఊటీ కొడైకెనాల్ లా భావిస్తున్నారు. స్థానికంగా లొకేష‌న్ల సెర్చ్ అధిక‌మైంది. మునుప‌టి కంటే తెలుగు నేటివిటీ లొకేష‌న్లు పెద్ద తెర‌పై చూసుకునే అవ‌కాశం పెరుగుతోంది.

ఇంత‌కుముందు `వెంకీ మామ` కోసం హిమాల‌యాల‌కు వెళ్లాల్సిన అవ‌స‌ర‌మే లేదన్న విమ‌ర్శ‌లొచ్చాయి. అలాంటి త‌ప్పిదం ఇప్ప‌టి స‌న్నివేశంలో రిపీట్ కాదు. ఇక సుకుమార్ సైతం పుష్ప కోసం విదేశాల‌కో కేర‌ళ‌కో వెళ్లాల‌నుకుని చివ‌రికి రాజ‌మండ్రి గోదారి ప‌రిస‌రాల్లోని మారేడి మిల్లి ఏజెన్సీని ఎంపిక చేసుకున్నారు. ఆ సినిమా హీరోలో ఉన్న విదేశీ ప్రీతి త‌గ్గిందిట‌. హీరో ద‌ర్శ‌కుడు స‌హా చాలా మందిలో నేటివిటీ క‌థ‌ల కంటే ఫారిన్ వెళ్లే క‌థ‌ల్ని న‌మ్మ‌డం త‌గ్గింద‌ట‌. ఇక పూరి బ్యాంకాక్ వెళ్లి క‌థ‌లు రాసే ఆలోచ‌న చేయ‌లేని స్థితి. ఇత‌ర ద‌ర్శ‌కులు ఇదే బాట‌లోకి మ‌ళ్లారు.

ఓవ‌రాల్ గా  మహమ్మారి భ‌యంతో దాదాపు అంద‌రు ద‌ర్శ‌కులు త‌మ సినిమాల‌ను హైద‌రాబాద్ లేదా వైజాగ్ లేక‌పోతే తెలుగు రాష్ట్రాల్లోనే కానిచ్చేయ‌డానికి ప్లాన్స్ చేసుకుంటున్నార‌ట‌. అంతేకాదు స్టోరీ సిట్టింగులు కోసం బ్యాంకాక్ లు.. ఫారిన్ ట్రిప్పులు ఉండ‌నే ఉండవు..! ఓ రూమ్ లేదా అఫిస్ లోనే అంతా కానిచ్చేస్తున్నార‌ట‌. ఏ ర‌కంగా చూసినా నిర్మాత‌కు మేలే క‌దా! అన్న చ‌ర్చా సాగుతోంది.
Tags:    

Similar News