హాస్యనటుడు పొట్టి రాంబాబు మృతి
టాలీవుడ్ లో గత పదిహేను రోజులుగా విషాదాంతాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇటీవలే పలువురు ప్రముఖులను కోల్పోయిన టాలీవుడ్ ఈ రోజు మరో కమెడియన్ ను కోల్పోయింది. పలు చిత్రాల్లో కమెడియన్ గా నవ్వులు పండించిన పొట్టి రాంబాబు ఈ రోజు మృతి చెందారు. ప్రభాస్ హీరోగా 2002లో వచ్చిన ఈశ్వర్ సినిమాతో రాంబాబు టాలీవుడ్ లో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చారు. బ్రెయిన్ కు స్ట్రోక్ రావడంతో రాంబాబును హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుప్రతిలో చేర్పించారు. అయితే ఆయన శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆయన వయస్సు 35 సంవత్సరాలు. అతనికి భార్య - కొడుకు - కూతురు ఉన్నారు.
రాంబాబు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి సమీపంలోని బూరుగుపూడి గ్రామంలో జన్మించారు. ఇప్పటివరకు ఆయన 40 చిత్రాల్లో నటించారు. ఈశ్వర్ - చంటిగాడు - కథానాయకుడు - దొంగల బండి - అస్త్రం - గోపి గోపిక గోదావరి - మీనాక్షి వంటి పలు చిత్రాల్లో నటించారు. పులి రాజా ఐపీఎస్ చిత్రంలో హీరోగా నటించారు. కత్తి లాంటి సినిమా - గీతోపదేశం - వంకరోడు వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్ చిత్రాల్లోనూ బిగ్ కమెడియన్స్ తో కలిసి చాలా చిత్రాల్లో రాంబాబు స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ప్రేమతో నువ్వు వస్తావని చిత్రంతోపాటు పలు చిత్రాల్లో ఆయన నటిస్తున్నారు. రాంబాబు పులిరాజా ఐపీఎస్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రయత్నాల్లో ఉండగానే ఆయన దురదృష్టవశాత్తు తిరిగిరాని లోకాలకు వెళ్లారు. రాంబాబు మృతికి టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు తమ సంతాపం వ్యక్తం చేశారు.