సూప‌ర్ స్టార్.. గ్యాప్ లో చెన్నైకి వెళ్లి ప్ర‌మోష‌నా?

Update: 2021-08-12 11:30 GMT
దేశ వ్యాప్తంగా సూప‌ర్  స్టార్ మ‌హేష్ కి ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ముఖ్యంగా గాళ్స్ లో అత‌ని ఫాలోయింగ్ అసాధార‌ణం. సెల‌బ్రిటీల‌లోనూ అత‌డికి గొప్ప ఫాలోయింగ్ ఉంది. చాలా మంది బాలీవుడ్ హీరోయిన్లు మ‌హేష్ ని సోష‌ల్ మీడియాల్లో ఫాలో అవుతుంటారు. అంద‌గాడిగా ప్రిన్స్ కి  సాటెవ్వ‌రు?..  అత‌ని కోస్టార్స్ అంతా  మ‌హేష్ లో ఛామ్ గురించి పొగిడేస్తుంటే వింటూనే ఉన్నాం. మోస్ట్ డిజైరబుల్ మెన్ గాను  చాలాసార్లు రికార్డుల‌కెక్కారు. మ‌హేష్ ఎలాంటి డ్రెస్ ధ‌రించినా స్మార్ట్ గా క‌నిపిస్తారు. ఇక మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీలకు మ‌హేష్ ఫోజిస్తే అది మ‌రో లెవ‌ల్లోనే ఉంటుంది. ఫోటో షూట్ల‌లో మ‌హేష్ పై ఎలివేన్స్ ఎప్ప‌టిక‌ప్పుడు ఫ్రెష్ ఫీల్ తీసుకొస్తుంటాయి. క‌వ‌ర్ స్టార్ గా ధ‌గ‌ధ‌గ‌లాడ‌టం మ‌హేష్ కి కొత్తే కాదు.

తాజాగా బ్లేజ‌ర్ లుక్ లో మ‌హేష్ ఎంతో మ‌నోహ‌రంగా  క‌నిపిస్తున్నారు. ఓటీవీ షో ప్ర‌చారం కోసం హాజ‌రైన సంద‌ర్భంగా త‌మిళ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ మ‌హేష్ తో క‌లిసి ఫోటో దిగారు. ప్ర‌స్తుతం ఈ ఫోటో మ‌హేష్ అభిమానుల్ని ఆక‌ట్టుకుంటోంది. ఇందులో అమ్మాయిలే అసూయ‌ప‌డేంత అందంగా క‌నిపిస్తున్నాడంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ‌హేష్ సినిమాల విష‌యానికి వ‌స్తే ప్ర‌స్తుతం ఆయ‌న ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో `స‌ర్కారు వారి పాట‌`లో న‌టిస్తున్నారు.  ఇప్ప‌టికే  కొద్ది భాగం షూటింగ్ పూర్త‌యింది. ప్ర‌స్తుతం టీమ్ మ‌హేష్ కి విశ్రాంతి కోసం స‌మ‌యాన్ని కేటాయించింది. ఇత‌ర న‌టీన‌టుల‌పై చిత్రీక‌ర‌ణ జ‌రుపుతున్నారు. ఆ గ్యాప్ లోనే స‌ర్కార్ వారి టీవీ ప్ర‌చారం కోసం చెన్నై వెళ్లిన‌ట్లు తెలుస్తోంది.  

ఇటీవ‌ల విడుద‌లైన `స‌ర్కారు వారి పాట`  టీజ‌ర్ కు ప్రేక్ష‌కుల నుంచి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది. యూట్యూబ్ లో సీక్రెట్ గా లీకైన వీడియో దెబ్బ‌కు వ్యూస్ అదే స్థాయిలో వ‌స్తున్నాయి. ఇక `స‌ర్కారు వారి పాట` త‌ర్వాత మ‌హేష్ ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నారు. ఇటీవ‌లే ప్రాజెక్ట్ ని క‌న్ఫ‌మ్ చేస్త `ఐయామ్ వెయింటింగ్` అంటూ మ‌హేష్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొంటున్నాయి. అలాగే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తోనూ మ‌రో సినిమాను ఖరారు చేసిన సంగ‌తి తెలిసిందే. గ‌తంలో వీరిద్ద‌రి కాంబినేష‌న్ లో అత‌డు..ఖ‌లేజా తెర‌కెక్కాయి. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడితో.. ప‌ర‌శురామ్ తోనూ సినిమాలు చేయాల్సి ఉంది.
Tags:    

Similar News