అమ్మ బర్త్ డే సందర్భంగా చరణ్ ఎమోషన్ పోస్ట్..!

Update: 2021-02-18 16:40 GMT
మెగాస్టార్ చిరంజీవి స‌తీమ‌ణి సురేఖ కొణిదెల నేడు పుట్టిన‌రోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సంద‌ర్భంగా మెగా కుటుంబ సభ్యులు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ముద్దుల త‌న‌యుడు మెగా ప‌వ‌ర్‌ స్టార్ రామ్ చ‌ర‌ణ్ త‌న త‌ల్లికి స్పెషల్ గా పుట్టినరోజు శుభాకాంక్ష‌లు తెలియజేశాడు. సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టిన చరణ్.. తన తల్లితో కలిసి ఉన్న ఓ మెమరబుల్ ఫొటోను షేర్ చేశాడు.

''నీ అమిత‌మైన ప్రేమ‌కు కృతజ్ఞతలు. పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మ'' అంటూ రామ్ చ‌ర‌ణ్ త‌ల్లి సురేఖ కు విషెస్ తెలిపాడు. ఈ సందర్భంగా పోస్ట్ చేసిన ఫొటోలో తల్లీకొడుకులు చరణ్ - సురేఖ నవ్వుతూ హుందాగా నిలబడి ఉన్నారు. దీనికి మెగా ఫ్యాన్స్ స్పందిస్తూ సురేఖ‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలావుండగా తండ్రీకొడుకులు చిరంజీవి - రామ్ చరణ్ కలిసి నటించాలని కోరుకున్న సురేఖ కల ఈ ఏడాది తీరబోతోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆచార్య' సినిమాలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేఖ సమర్పకురాలిగా వ్యవహరిస్తుండగా మ్యాట్నీ మూవీస్ - కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి - చరణ్ కలిసి నిర్మిస్తున్నారు. మే 13న 'ఆచార్య' విడుదల కానుంది.



Tags:    

Similar News