ఆమిర్ బర్త్ డే పార్టీలో ఎంతమంది తారలో

Update: 2017-03-15 13:23 GMT
మార్చ్ 14 బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ బర్త్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. నిన్నటితో ఈయన 52 వసంతాలు పూర్తి చేసుకుని.. 53వ ఏట అడుగు పెట్టాడు. ఈ వయసులోను దంగల్ చిత్రం కోసం ఆమిర్ పడ్డ కష్టం చూస్తే.. మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అనే బిరుదు ఎంత కరెక్ట్ అనే విషయం అర్ధమవుతుంది.

తన బర్త్ డే సందర్భంగా.. బాలీవుడ్ సెలబ్రిటీల కోసం ప్రత్యేకంగా బర్త్ డే బాష్ ఏర్పాటు చేశాడు ఆమిర్. ఈ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు.. అనేక మంది సెలబ్రిటీలు హాజరయ్యారు. ఆమిర్ ఎలాగూ పార్టీలో ఉంటాడు. ఆయన భార్య కిరణ్ రావ్.. మాజీ భార్య రీనా దత్తా.. కూతురు ఇరా.. మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ లతో పాటు పలువురు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. " నీ గురించి నవ్వు సంతోషంగా భావిస్తున్నపుడు వయసు ఎంతైనా.. ఏ విషయంలోనూ ఏ మాత్రం తేడా ఉండదు" అంటూ చిన్నపాటి సందేశం ఇచ్చాడు ఆమిర్.  

మరోవైపు ఇండస్ట్రీ నుంచి షారూక్ ఖాన్.. అయేషా ష్రాఫ్.. ఫైసల్ ఖాన్.. ఫాతిమా సనా షేక్.. ఇమ్రాన్ ఖాన్.. అవంతికా మాలిక్.. వందనా మాలిక్.. రీనా దత్తా.. ఇరా ఖాన్. మన్సూర్ ఖాన్.. ముకేష్ చాబ్రా.. శసి తన్వర్.. సిద్ధార్ధ రాయ్ కపూర్.. విజయ్ కృష్ణ ఆచార్య.. జీనత్ లు హాజరయ్యారు. దంగల్ చిత్రానికి మూలం అయిన మహావీర్  సింగ్ ఫొగట్ కుటుంబం మొత్తం ఈ వేడుకలో పాలు పంచుకున్నారు. ఇంత మంది తారలు.. సెలబ్రిటీలతో ఆమిర్ ఖాన్ బర్త్ డే బాష్ అదిరిపోయే రేంజ్ లో జరిగింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News