'బ్రో' ప్రీ రిలీజ్ రాజమండ్రిలోనా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్-సాయితేజ్ కథానాయకులుగా సముద్రఖిన దర్శకత్వంలో ` బ్రో` అనే చిత్రం తెరకెక్కుతోనన్ సంగతి తెలిసిందే. తమిళ్ లో విజయం సాధించిన వినోదయ్య సిద్దంకి రీమేక్ రూపం ఇది. ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శర వేగంగా జరుగుతు న్నాయి. పవన్ కెరీర్ లోనే అత్యంత వేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమా ఇదే.
ఇందులో పవన్ నిడివి తక్కువగానే ఉంటుందని తెలుస్తోంది. దేవుడి పాత్ర కావడంతో! చాలా పరిమితం గానే తెరపై కనిపించే అవకాశం ఉంది. ఆ రకంగా ఇది పవన్ కి గెస్ట్ రోల్ లాంటిదా? అన్న సందేహం వ్యక్తం అవుతుంది. దానిపై క్లారిటీ రావాలంటే రిలీజ్ అవ్వాలి. ఆ సంగతి పక్కనబెడితే జులైలో సినిమా రిలీజ్ చేయాలని భావిస్తోన్న నేపథ్యంలో ప్రచారం పనులు మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు. దీనిలో భాగంగా ప్రీరిలీజ్ ఈవెంట్ని రాజమండ్రిలో నిర్వహించాలని సన్నాహాలు చేస్తున్నారుట.
రెగ్యులర్ గా నిర్వహించే హైదరాబాద్ కంటే రాజమండ్రి అయితే మరింత రెస్పాన్స్ ఉంటుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ వారాహి యాత్ర కూడా అటువైపే సాగుతోంది. భారీ ఎత్తున అభిమానులు తరలి వస్తున్నారు. యాత్రకి ఇసకేస్తే రాలనంత జనం రోజూ తరలి వస్తున్నారు. ప్రస్తుతం పవన్ ఎక్కడి సినిమాలు అక్కడ షూటింగ్ ఆపేసీ వారాహి యాత్రపైనే బిజీగా ఉన్నారు.
ఈ నేపథ్యంలో పవన్ డేట్లు ఇచ్చిన నిర్మాతలు ఆయన ఎక్కడ ఉంటే అక్కడే తమ సినిమా షూటింగ్ కూడా చేసుకుంటా అంటున్నారు. ఈ నేపథ్యంలో బ్రో ప్రీరిలీజ్ వేదిక రాజమండ్రి అని బయటకు రావడం విశేషం. ఏపీలో సినిమా షూటింగ్ లు... ఈవెంట్లు నిర్వహించాలని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం కొన్ని రకాల మినహాయింపులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. అయితే బ్రో టీమ్ రాజమండ్రి ఎంపిక నిజమైతే ఇది ఆకోణంలో జరిగింది కాదు. కేవలం పవన్ యాత్రని ఆధారంగా చేసుకుని ఎంపిక చేసుకునే వేదిక కావొచ్చు.