ఈ సెంటిమెంట్ ని ఆ న‌టుడు న‌మ్ముతాడా?

రెండు..మూడేళ్ల‌గా ఒత్తిడి ఉన్నా? ఏడాది కాలంగా ఒత్తిడి తీవ్రంగా మార‌డంతో ఊ కొట్టాడు. అలా ఊ కొట్టాడో లేదో? వెంట‌నే పెళ్లి సంబంధం సెట్ అయింది.;

Update: 2026-03-02 19:30 GMT

కొంద‌రి జీవితాల్లో అనుకున్నవి వేవి జ‌ర‌గ‌వు. ఎంత ట్యాలెంట్ ఉన్నా? అక్క‌డికే ప‌రిమితం త‌ప్ప జీవితంలో ఎలాంటి మార్పు ఉండ‌దు. అయితే పెళ్లి త‌ర్వాత జీవితం మారుతుంది. క‌లిసొస్తుంది అనే మాట‌లు కూడా ఎక్కువ‌గా విన బ‌డుతుంటాయి. పెద్ద‌లు కూడా ఈ మాట‌ను ఎంతో బ‌లంగా చెబుతుంటారు. అలా క‌లిసొచ్చిన వాళ్లు లేక‌పోలేదు. రాత్రికి రాత్రే ధ‌న‌వంతులైన వాళ్లు..ఫేమ‌స్ అయిన వాళ్ల‌...వ్యాపారాల్లో స‌క్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ ఫార్ములా ఆ న‌టుడికి వ‌ర్కౌట్ అవుతుందో ? లేదో? చూడాలి. వివ‌రాల్లోకి వెళ్తే ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌-ర‌ష్మికా మంద‌న్నాలు ధాంపత్య జీవితంలోకి అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.

మ‌రికొన్ని గంట‌ల్లో హైరాబాద్ లో రిసెప్ష‌న్ కూడా జ‌ర‌గ‌బోతుంది. టాలీవుడ్ సెల‌బ్రిటీలంతా ఈ వేడుక‌కు హాజ‌రు కానున్నారు. తారలంతా ఒకే చోట గేద‌ర్ అవ్వ‌డం విశేషం. అలాగే మ‌రో న‌టుడు కూడా రెండు..మూడు రోజుల్లో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇంత‌కాలం వివాహానికి దూరంగా ఉన్నాడు. జీవితంలో తాను అనుకున్న‌ది సాధించిన త‌ర్వాత పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు . ఈ క్ర‌మంలో చాలా కాలం పాటు పెళ్లిని వాయిదా వేసాడు. అయితే తాను సాధించాల్సింది ఇంకా సాద్య‌ప‌డ‌లేదు. దీంతో ఇంట్లో పెళ్లి చేసుకోవాలి అనే ఒత్తిడి మొద‌లైంది.

రెండు..మూడేళ్ల‌గా ఒత్తిడి ఉన్నా? ఏడాది కాలంగా ఒత్తిడి తీవ్రంగా మార‌డంతో ఊ కొట్టాడు. అలా ఊ కొట్టాడో లేదో? వెంట‌నే పెళ్లి సంబంధం సెట్ అయింది. అయితే ఈ వివాహ బంధం త‌ర్వాత త‌న జీవితం కూడా మారుతుంద‌ని అత‌డు ఆశిస్తున్నాడుట‌. బ్యాచిల‌ర్ లైఫ్ లో సాధించ‌లేనిది పెళ్లి త‌ర్వాత సాధిస్తారు? అనే మాట‌ను అత‌డు కూడా బ‌లంగా న‌మ్మి ముందుకెళ్తున్నాడుట‌. మ‌నిషిని ముందుకు తీసుకెళ్లేది న‌మ్మ‌కం, ఆశ మాత్ర‌మే. అయితే అది బ్యాలెన్స్ గా ఉండాలి. అతిగా న‌మ్మ‌కూడ‌దు..అతిగా ఆశ‌ప‌డ‌కూడ‌దు. అయితే ఈ న‌టుడి ఆశ‌, న‌మ్మ‌కం విష‌యంలో బ్యాలెన్స్ గానే ఉంటాడు.

క‌ష్ట‌ప‌డే త‌త్వం ఉన్న న‌టుడు. బ్యాక్ గ్రౌండ్ ఉంద‌ని విర్ర వీగ‌డు. ఎంతో డౌన్ టౌ ఎర్త్ ఉంటాడు. సాధార‌ణ జీవితాన్నే ఇష్ట‌ప‌డ‌తాడు. మ‌రి అలాంటి న‌టుడి సినీ జీవితంతో పెళ్లి త‌ర్వాత మారాల‌ని నెటి జ‌నులు ఆశీస్తున్నారు. ఇప్ప‌టికే అదే కుటుంబం నుంచి న‌టులుగా ఎంట్రీ ఇచ్చిన వారంతా స‌క్సెస్ పుల్ గా దూసుకుపోతున్నారు.

Tags:    

Similar News