చీరకట్టులో గ్లామర్ డోస్ పెంచేసిన ప్రభాస్ బ్యూటీ!

తాజాగా ఆమె పోస్ట్ చేసిన చీరకట్టు ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి.;

Update: 2026-03-03 02:45 GMT

బాలీవుడ్ సెన్సేషన్, నేషనల్ క్రష్ త్రిప్తి డిమ్రి తన అందచందాలతో మరోసారి ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇవి పాత జ్ఞాపకాలుగా మారకముందే అప్‌లోడ్ చేస్తున్నాను అంటూ షేర్ చేసిన చీరకట్టు ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. సంప్రదాయబద్ధమైన లుక్‌లో కనిపిస్తూనే, తనదైన స్టైల్‌లో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేస్తోంది ఈ భామ. 'యానిమల్' సినిమాతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన ఈ బ్యూటీ, ఇప్పుడు తన గ్లామర్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

 

త్రిప్తి సక్సెస్ జర్నీ:

 

త్రిప్తి డిమ్రి సినీ ప్రయాణం 2017లో 'పోస్టర్ బాయ్' చిత్రంతో మొదలైంది. ఆ తర్వాత వచ్చిన రొమాంటిక్ డ్రామా 'లైలా మజ్ను'లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కేవలం అందానికే పరిమితం కాకుండా, ప్రతిభావంతురాలైన నటిగా గుర్తింపు తెచ్చుకుంది.ఇక 2021లో ఫోర్బ్స్ ఆసియా '30 అండర్ 30' జాబితాలో చోటు సంపాదించుకోవడం ఆమె కెరీర్‌లో ఒక పెద్ద మైలురాయి. ఇక కష్టపడి పైకి వచ్చిన త్రిప్తి, ఇప్పుడు బాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. ఆమె ఎంపిక చేసుకునే కథలు, నటనలోని వైవిధ్యం ఫాన్స్ ను అలరిస్తున్నాయి.

 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోషూట్:

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా, సోషల్ మీడియాలో తన అభిమానులను పలకరించడం త్రిప్తి మర్చిపోదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన చీరకట్టు ఫోటోలు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఫ్యాషన్ డ్రెస్ లో ఎంత బోల్డ్‌గా కనిపిస్తుందో, చీరలో అంతటి హోయలు ఒలికిస్తూ కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది. ఇక ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు స్టన్నింగ్ బ్యూటీ అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు. పాత జ్ఞాపకాలుగా మారకముందే తన అందాలను ఫ్యాన్స్‌కు షేర్ చేసి, మరోసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది ఈ స్పిరిట్ బ్యూటీ.

 

ప్రభాస్ ‘స్పిరిట్’లో త్రిప్తి:

రెబల్ స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్‌లో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సందీప్ రెడ్డి వంగా సినిమాలంటేనే హీరో-హీరోయిన్ల మధ్య ఘాటు రొమాన్స్, బోల్డ్ సీన్స్ మరియు ఇంటెన్స్ లిప్ కిస్సులు ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక 'యానిమల్'లో తన గ్లామర్‌తో కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టించిన త్రిప్తి, ఇప్పుడు ప్రభాస్‌తో కలిసి ఎలాంటి మ్యాజిక్ చేయబోతుందోనని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేస్తూ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

Tags:    

Similar News