చరణ్ 'పెద్ది'.. 'రై రై రా రా' సాంగ్ తో మాస్ వైబ్
ఈ పాటలో చరణ్ లుక్ ఎనర్జీ లెవల్స్ చూస్తుంటే, బుచ్చిబాబు ఒక సాలిడ్ మాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలో చరణ్ మేకోవర్ చాలా నేచురల్‌గా కుదిరింది.;
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ ‘పెద్ది’ సినిమాపై అంచనాలు మెల్లమెల్లగా పెరుగుతున్నాయి. ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన ‘చికిరీ చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేయగా, ఇప్పుడు మేకర్స్ రెండో సింగిల్ ‘రై రై రా రా’ని విడుదల చేసి ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు.
ఇక లేటెస్ట్ గా విడుదలైన ‘రై రై రా రా’ సాంగ్ పక్కా మాస్ బీట్‌తో ఆకట్టుకుంటోంది. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ తనదైన స్టైల్‌లో కంపోజ్ చేసిన ఈ పాట వింటుంటేనే వైబ్రేషన్స్ మొదలవుతున్నాయి. చరణ్ తన రగ్గడ్ లుక్‌తో, గుబురు గడ్డం స్టైలిష్ బాడీ లాంగ్వేజ్‌తో ఈ సాంగ్‌లో విశ్వరూపం చూపించారు. ముఖ్యంగా డ్యాన్స్ లో ఆ గ్రేస్ ఎనర్జీ నేటి తరం ఆడియన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చేలా ఉన్నాయి.
సాంగ్ వీడియోలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా కనిపిస్తున్నాయి. రత్నవేలు సినిమాటోగ్రఫీ సాంగ్‌లోని ఇంటెన్సిటీని మరో లెవల్‌కు తీసుకెళ్లింది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ వేసిన స్టెప్పులు చాలా వేగంగా, పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. పొలాల్లో, ఫ్యాక్టరీ బ్యాక్‌డ్రాప్‌లో వందలాది మంది డ్యాన్సర్ల మధ్య చరణ్ చేసే డాన్స్ బాక్సాఫీస్ దగ్గర జాతర ఖాయమని హింట్ ఇస్తోంది. అనంత శ్రీరామ్ లిరిక్స్ కథలోని పోరాట పటిమను గుర్తుచేస్తున్నాయి.
ఈ పాటలో చరణ్ లుక్ ఎనర్జీ లెవల్స్ చూస్తుంటే, బుచ్చిబాబు ఒక సాలిడ్ మాస్ క్యారెక్టర్‌ను డిజైన్ చేసినట్లు అర్థమవుతోంది. గ్రామీణ నేపథ్యం ఉన్న కథలో చరణ్ మేకోవర్ చాలా నేచురల్‌గా కుదిరింది. పాట మధ్యలో వచ్చే కొన్ని యాక్షన్ కట్స్ చరణ్ పట్టుకున్న క్రికెట్ బ్యాట్ చూస్తుంటే, సినిమాలో స్పోర్ట్స్ కి సంబంధించిన ఏదో పెద్ద ఎమోషనల్ జర్నీ ఉండబోతోందనిపిస్తోంది. రెహమాన్ మ్యూజిక్ మరియు చరణ్ డ్యాన్స్ కలిస్తే థియేటర్లు దద్దరిల్లడం గ్యారెంటీ.
ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాపై నేషనల్ వైడ్ గా భారీ హైప్ ఉంది. RRR తర్వాత చరణ్ క్రేజ్ మరింత పెరగడంతో ప్రతి అప్‌డేట్ ట్రెండింగ్‌లో ఉంటోంది. బుచ్చిబాబు సానా తన విజన్‌తో ఈ చిత్రాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కిస్తున్నట్లు విజువల్స్ చెబుతున్నాయి. ఈ సినిమా చరణ్ కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్టులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, శివరాజ్ కుమార్, బొమన్ ఇరానీ, జగపతి బాబు వంటి హేమాహేమీలు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఇక త్వరలోనే ఒక స్పెషల్ టీజర్ ను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.