అల్లు శిరీష్ రిసెప్ష‌న్‌లో 1000 కోట్ల క్ల‌బ్ డైరెక్ట‌ర్

అట్లీ కేవలం ఒక అతిథిగా మాత్రమే కాకుండా, అల్లు కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఈ వేడుకలో కనిపించారు.;

Update: 2026-03-02 19:16 GMT

ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో దర్శకుడు అట్లీ పేరు ఒక సంచలనం. `జవాన్` సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్‌లో చేరిన ఈ యంగ్ డైరెక్టర్ క్రేజ్ రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా అది హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా అల్లు శిరీష్ - నైనికల ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌లో అట్లీ ప్రత్యక్షమవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో అంబానీ ఇంట జరిగిన అపర కుబేరుల వివాహ వేడుకలో సందడి చేసిన అట్లీ.. ఇప్పుడు మళ్ళీ త‌న‌ ప్రాధాన్యతా క్ర‌మంలో అల్లు వారి వేడుకలో మెరవడం విశేషం.

ఈ వేడుకలో అట్లీ తన స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఖరీదైన సూట్ ధరించి ఎంతో క్లాసీగా విచ్చేసిన ఆయన వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ముఖ్యంగా విందులో టాలీవుడ్ దిగ్గ‌జాల న‌డుమ‌ అట్లీ మెరిసిపోయాడు. ఇదే వెన్యూ వ‌ద్ద‌ కామెడీ కింగ్ బ్రహ్మీ సరదాగా ముచ్చటించడం చూస్తుంటే వేదిక‌కు వెలుగు వ‌చ్చింది.

అట్లీ కేవలం ఒక అతిథిగా మాత్రమే కాకుండా, అల్లు కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా ఈ వేడుకలో కనిపించారు. దీనికి ప్రధాన కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో అత‌డు చేస్తున్న భారీ ప్రాజెక్ట్. వీరిద్దరి కాంబినేషన్‌లో ఒక భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. భారతీయ సినీ చరిత్రలోనే మరో టెక్నికల్ వండర్‌ను, అల్లు అర్జున్‌కు మరో 1000 కోట్ల క్లబ్ సినిమాను అట్లీ అందించబోతున్నాడనే అంచనాలతో ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు ఈ దర్శకుడిపైనే ఉన్నాయి.

ఈ గ్రాండ్ రిసెప్షన్‌లో అట్లీతో పాటు టాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా సందడి చేశారు. మెగా బ్రదర్ నాగబాబు, ఆయ‌న‌ ఫ్యామిలీ, ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి, ఆస్కార్ విజేత చంద్రబోస్ వంటి దిగ్గజాలు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంతమంది సెలబ్రిటీల మధ్య అట్లీ ప్రత్యేకంగా నిలవడం ఆయన ప్రస్తుత పాన్ ఇండియా ఇమేజ్‌కు అద్దం పడుతోంది.

మొత్తానికి అంబానీల వెడ్డింగ్ తర్వాత అట్లీ అటెండ్ అయిన టాప్ 5 వెడ్డింగ్స్‌లో అల్లు శిరీష్ వివాహ వేడుక చేరిపోయింది. ఒకవైపు భారీ సినిమాతో సెట్లో బిజీగా ఉన్నా.. అల్లు అర్జున్‌తో ఉన్న స్నేహం కోసం అట్లీ సమయం కేటాయించి రావడం మెగా అభిమానులను ఖుషీ చేస్తోంది. అయితే అప్ప‌ట్లో అనంత్ అంబానీ పెళ్లి కోసం అట్లీ ఒక 10ని.ల యానిమేటెడ్ ఫిలిమ్‌ని కూడా చిత్రీక‌రించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. మార్చి 6న జరగనున్న‌ ప్రధాన వివాహ ఘట్టానికి కూడా మరికొంతమంది స్టార్స్ విచ్చేసే అవకాశం ఉంది.

Tags:    

Similar News