దురంధ‌ర్ 2 (X) టాక్సిక్ : ఓ మై గాడ్! షాకింగ్ ర‌న్ టైమ్!!

తాజా స‌మాచారం మేర‌కు.. టాక్సిక్ దాదాపు 200 నిమిషాలు లేదా 3 గంటల 20 నిమిషాలకు వస్తుంది. ఈ చిత్రంలో తగినంత వినోదం, మాస్ ని ఆక‌ర్షించే విష‌యాలున్నాయ‌ని తెలుస్తోంది.;

Update: 2026-03-02 19:16 GMT

ఈ మ‌ధ్య రెండున్న‌ర గంట‌ల సినిమా అనే మాట వినిపించ‌డం లేదు.. 3 గంట‌లు లేదా అంత‌కుమించి అనే చ‌ర్చ సాగుతోంది! ఈ రెండు సినిమాలు ర‌న్ టైమ్ విష‌యంలో చ‌రిత్ర‌ను తిర‌గ‌రాస్తున్నాయి. ప్రేక్ష‌కుడిని దాదాపు రెండున్న‌ర గంట‌ల పాటు థియేట‌ర్ లో కూచోబెట్టాలంటే మ‌న ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చాలా ప్ర‌యాస‌లు ప‌డేవారు. ఎక్క‌డ సీన్ ల్యాగ్ అయినా సీట్ వ‌దిలేసి బ‌య‌ట‌కు వెళ్లి ఫోన్లు మాట్లాడుకునేవారు.. ల్యాగ్ సీన్ అయిపోయాక మ‌ళ్లీ లోనికి వ‌చ్చేవారు...

కానీ ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ ఏంటో కానీ.. అటు బాలీవుడ్ మూవీ దురంధ‌ర్ 2, ఇటు శాండ‌ల్వుడ్ మూవీ టాక్సిక్ ర‌న్ టైమ్ లో త‌గ్గేదే లే అంటూ దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్నాయి. 3గం.40ని.ల సుదీర్ఘ నిడివితో.. అంటే దాదాపు 4 గంట‌ల సినిమాగా దురంధ‌ర్ 2 విడుద‌ల కానుండ‌గా, 3గం.ల 20ని.ల నిడివితో టాక్సిక్ కూడా స‌ర్ ప్రైజ్ చేస్తోంది. నిజానికి టాక్సిక్ సినిమా కేవ‌లం 2.20 నిమిషాలు మాత్ర‌మే ఉంటుంద‌ని ఇంత‌కుముందు ప్ర‌చార‌మైనా కానీ, అది నిజం కాద‌ని తాజాగా స‌మాచారం అందింది.

అయినా దురంధ‌ర్ 2 కంటే య‌ష్ న‌టించిన టాక్సిక్ మాత్రం 20 నిమిషాల త‌క్కువ నిడివితో వ‌స్తోంది. అంటే థియేట‌ర్ల‌లో దురంధ‌ర్ 2 సినిమా చూసి ఇంటికి వెళ్లాలంటే క‌నీసం 4 గంట‌ల స‌మ‌యాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఒకే రోజు దురంధ‌ర్ 2, టాక్సిక్ సినిమాల‌ను చూడాల‌నుకునే వీరాభిమానులు అయితే ఆ రోజంతా వీటికోస‌మే కేటాయించాలి. దాదాపు 7 గంట‌ల పాటు థియేట‌ర్ లోనే కూచోవాల్సి ఉంటుంది.

తాజా స‌మాచారం మేర‌కు.. టాక్సిక్ దాదాపు 200 నిమిషాలు లేదా 3 గంటల 20 నిమిషాలకు వస్తుంది. ఈ చిత్రంలో తగినంత వినోదం, మాస్ ని ఆక‌ర్షించే విష‌యాలున్నాయ‌ని తెలుస్తోంది. తద్వారా ప్రేక్షకులు విసుగు చెందరు లేదా విశ్రాంతి తీసుకోరు. నిడివి మ్యాట‌ర్ లో `యానిమల్` (2023)తో ఇదంతా మారిపోయింది. ఇది 3 గంటల 21 నిమిషాల నిడివితో చాలా విజయవంతంగా నడిచింది. ఇటీవలే `బోర్డర్ 2` చిత్రం 3 గంటల 19 నిమిషాల రన్‌టైమ్‌తో విడుదలైంది. ధురంధర్ (2026) మొదటి భాగం నిడివి 3 గంటల 34 నిమిషాలు. ఈ చిత్రాలన్నీ భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు దురంధ‌ర్ 2, టాక్సిక్ కూడా అదే బాటలో ముందుకు సాగుతున్నాయి.

Tags:    

Similar News