• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూరి ఛార్మికి బాక్సింగ్...

పూరి ఛార్మికి బాక్సింగ్ లెజెండ్‌ సూపర్‌ గిఫ్ట్‌

By - Tupaki Desk
Update: 2021-12-02 11:30 GMT
విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా రూపొందుతున్న లైగర్ సినిమా చిత్రీకరణ యూఎస్ షెడ్యూల్‌ పూర్తి అయ్యింది. గత రెండు మూడు రోజులుగా చిత్ర యూనిట్‌ సభ్యులు పూర్తి పార్టీ మూడ్ లో ఉన్నారు. పూరి మరియు ఛార్మిలతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులకు మైక్‌ టైసన్‌ ప్రత్యేకంగా పార్టీ ఇవ్వగా.. మైక్ టైసన్ కు చిత్ర యూనిట్‌ సభ్యులు స్పెషల్‌ పార్టీని ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి చిత్ర యూనిట్‌ సభ్యులు మైక్‌ టైసన్ కు గుడ్‌ బై చెప్పే సమయం వచ్చేసింది. పూరి జగన్నాద్‌ మరియు ఛార్మిలకు మైక్‌ టైసన్ ప్రత్యేకంగా తాను ఆటోగ్రాఫస్ చేసిన బాక్సింగ్‌ గ్లౌజ్ లను గిఫ్ట్‌ గా ఇచ్చాడు. బాక్సింగ్ లెజెండ్‌ నుండి బాక్సింగ్‌ గ్లౌజ్‌ లు బహుమానంగా పొందడం అంటే ఖచ్చితంగా అది అదృష్టం అనడంలో సందేహం లేదు.

ప్రపంచ ప్రసిద్ది గాంచిన మైక్‌ టైసన్‌ ఇచ్చిన ఆ గిఫ్ట్‌ కు పూరి మరియు ఛార్మిలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో టైసన్‌ గిఫ్ట్ ను షేర్‌ చేశారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న లైగర్‌ సినిమా లో మైక్‌ టైసన్‌ పాత్ర ఏంటీ అంటూ ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పూరి మరియు ఛార్మిలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ను హిందీ లో కరణ్‌ జోహార్‌ విడుదల చేయబోతున్నాడు. ఆయన కూడా ఒక నిర్మాతగా ఈ సినిమాకు వ్యవహరిస్తున్నాడు. అనన్య పాండే వల్ల ఈ సినిమాకు బాలీవుడ్‌ లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పటికే విజయ్ దేవరకొండకు అక్కడ మంచి గుర్తింపు ఉండటం వల్ల పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడానికి చాలా ఈజీ అయ్యిందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ మరియు పూరిల కాంబోలో రాబోతున్న ఈ సినిమా ను ఏప్రిల్‌ 1న విడుదల చేస్తారనే వార్తలు వచ్చాయి. కాని అదే రోజున సర్కారు వారి పాట విడుదల ఉండటం వల్ల ఆ తేదీ అయ్యి ఉండదు అంటున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ రావాల్సి ఉంది. విజయ్‌ దేవరకొండ గత చిత్రాలు నిరాశ పర్చిన నేపథ్యంలో అభిమానులు ఈ సినిమా సక్సెస్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక పూరి గత చిత్రం ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్ అవ్వడం వల్ల ఈ సినిమా ను ఖచ్చితంగా సక్సెస్ చేస్తాడని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అలా ఈ సినిమా పై అన్ని విధాలుగా అంచనాలు ఉన్నాయి. పాన్‌ ఇండియా ప్రేక్షకులకు మైక్ టైసన్ ఉండటం వల్ల కూడా ఆసక్తిగా ఉంటుందని అంటున్నారు. లైగర్ సినిమా షూటింగ్‌ ముగించిన నేపథ్యంలో ఇక నుండి ప్రమోషన్‌ కార్యక్రమాలు షురూ చేసే అవకాశాలున్నాయి.
Tags:    
  • liger 
  • pujijagannadh 
  • vijaydeverakonda 
  • panindia 
  • ananya 
  • miketson 
  • Charmy Kaur 
  • liger movie update 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS