డ్రగ్స్ కేసు: స్టార్ ప్రొడ్యూసర్ కి నోటీసులు జారీ..!

Update: 2020-12-18 07:52 GMT
బాలీవుడ్ యువ హీరో సుశాంత్‌ సింగ్ రాజ్‌ పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌ లో డ్రగ్స్ ప్రకంపనలు మొదలైన విషయం తెలిసిందే. సుశాంత్ సూసైడ్ కేసు విచారణలో డ్రగ్స్ వ్యవహారం బయటపడటంతో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ముమ్మరంగా ద‌ర్యాప్తు చేస్తోంది. ముందుగా సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి ని అరెస్ట్ చేసి, ఆ తర్వాత డ్రగ్స్ కేసులో అనేక మంది బాలీవుడ్ సెలబ్రిటీలను ఎన్‌సీబీ అధికారులు విచారించారు. అలానే బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షితిజ్ రవి ప్రసాద్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో అతన్ని ఎన్సీబీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో కరణ్ జోహార్‌ కు కూడా నోటీసులు జారీ చేసిందని తెలుస్తోంది.

కరణ్ జోహార్ 2019లో జూలై నెలలో సెలబ్రిటీస్‌ తో కలిసి నిర్వహించిన పార్టీపై వివరణ ఇవ్వాలని ఎన్సీబీ ఆదేశించింది. చాలా మంది సెలబ్రిటీలు హాజరైన ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ నిర్వాహకుడు కరణ్ ప్రత్యక్షంగా విచారణకు హాజరుకావాలని ఎన్సీబీ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. కాగా, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు ఈ కేసు దర్యాప్తులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ - దీపికా పదుకొనే - సారా అలీ ఖాన్ - శ్రద్ధా కపూర్ లను విచారించారు. వీరితో పాటు టాలెంట్ మేనేజర్ జయ సాహా మరియు దీపిక మేనేజర్ కరిష్మా ప్రకాష్ లను కూడా ఎన్సీబీ ప్రశ్నించింది. అలానే ప్రముఖ నటుడు అర్జున్ రాంపాల్ మరియు ఆయన ప్రియురాలు గాబ్రియెల్లా దెమిత్రియాడెన్‌ ను కూడా ఎన్సీబీ విచారించింది.
Tags:    

Similar News