• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  దత్తత బాట పడుతున్న...

దత్తత బాట పడుతున్న బాలీవుడ్

By - Tupaki Desk
Update: 2017-07-21 17:30 GMT
బాలీవుడ్ హాట్‌ స్టార్ సన్నీలియన్ - డేనియల్ వెబర్ దంపతులు ఓ చిన్నారిని దత్తత తీసుకున్నారు. మహారాష్ట్రలోని లాతూర్‌ కు చెందిన బాలికను దత్తత తీసుకున్న వారు ఆ పాపకు నిషా కౌర్ వెబర్ అని నామకరణం చేశారు. ఈ నేపథ్యంలో సన్నీ దంపతులకు బాలీవుడ్ నటుల నుంచి శుభాకాంక్షలు అందుతున్నాయి.
    
కాగా బాలీవుడ్ ప్రముఖులు ఇలా దత్తత తీసుకోవడం తక్కువే. ఎక్కువగా ఐవీఎఫ్ విధానంలో పిల్లలను కంటుంటారు.. లేదంటే ఇటీవల సరోగసీనీ ఆశ్రయిస్తున్నారు. షారూక్ ఖాన్.. అమీర్ - తుషార్ కపూర్ - కరణ్ జోహార్ వంటివారంతా అలాగే చేశారు. అందుకు భిన్నంగా సన్నీ మాత్రం దత్తత బాట పట్టింది.
    
హాలీవుడ్ లో ఎక్కువ మంది సెలబ్రిటీలు పిల్లలను దత్తత తీసుకుంటారు. టామ్ క్రూయిజ్ - ఏంజెలినా జోలీ - బ్రాడ్ పిట్ వంటివారంతా ఈమార్గమే అనుసరించారు. బాలీవుడ్ లో ఇలాంటి ప్రాక్టీస్ ఎక్కువగా లేనప్పటికీ కొందరు మాత్రం దత్తత తీసుకున్నవారున్నారు.

పిల్లలను దత్తత తీసుకున్న బాలీవుడ్ ప్రముఖులు

* సన్నీలియోన్... తాజాగా ఓ పాపను దత్తత తీసుకుంది.

* సుస్మిత సేన్.. చాలాకాలం కిందటే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది.

* రవీనా టాండన్.. తనకు 21 ఏళ్లున్నప్పుడే ఇద్దరు అమ్మాయిలను పెంచుకుంది.

* సలీంఖాన్.. సల్మాన్ ఖాన్ తండ్రి అయిన ఈ పాపులర్ స్క్రిప్ట్ రైటర్ తనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నా కూడా మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఆ అమ్మాయి అర్పితకు 2015లో హైదరాబాద్ లోని ఫలకునుమా ప్యాలస్ లో ఘనంగా వివాహం జరిపించిన సంగతి తెలిసిందే.

* మిథున్ చక్రవర్తి... మిథున్ చక్రవర్తికి కూడా పిల్లలున్నప్పటికీ చెత్త కుప్పలో కనిపించిన ఓ చిన్నారిని పెంచి పెద్ద చేశారు. ఆ పాప ఇప్పుడా కుటుంబంలో అల్లారుముద్దుగా పెరుగుతోంది.
Tags:    
  • Bollywood Celebs 
  • Kids 
  • Telugu NEWs 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS