మరో నటుడు అనుమానాస్పద మృతి.. హత్యేనంటూ ప్రచారం

Update: 2020-09-29 15:55 GMT
తాజాగా బిహార్ కు చెందిన నటుడు అక్షత్ ఉత్కర్ష్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. అక్షత్ ముంబైలో స్థిరపడ్డాడు. భోజ్ పురి సినిమాల్లో నటించారు. కొన్ని టీవీ సీరియళ్లలో కనిపించారు. బాలీవుడ్ లో అవకాశాలు వస్తుండడంతో ముంబైలో స్థిరపడ్డారు. రెండేళ్లుగా ముంబైలో ఉంటున్నారు. అంధేరి వెస్ట్ లోని సురేష్ నగర్ అద్దెకు నివాసం ఉంటున్నాడు.

అక్షత్ తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఉరివేసుకున్న స్థితిలో ఆయన కనిపించారు. పోలీసులు ఉత్కర్ష్ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన మృతదేహాన్ని బిహార్ లోని స్వగ్రామం సికిందర్ పూర్ కు తరలించారు.

సుశాంత్ మరణించినట్టే అక్షత్ మరణించడంతో ఇతడి మరణం వెనుక కారణాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు. స్నేహా చౌహాన్ అనే వర్ధమాన నటి అక్షత్ తో సంబంధాలు ఉన్నాయని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మరణం కూడా సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది.
Tags:    

Similar News