'ఆహా'లో రిలీజ్ కాబోతున్న సినిమా వల్ల మనోభావాలు దెబ్బతిన్నాయట...!
నవీన్ చంద్ర - సలోని లుథ్రా హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'భానుమతి రామకృష్ణ'. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని 'ఆహా' ఓటీటీలో జూలై 3న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నార్త్ స్టార్ ఎంటర్‌టైన్మెంట్ సమర్పణలో కృశివ్ ప్రొడక్షన్స్ మరియు హ్యాండ్ పిక్డ్ స్టోరీస్ బ్యానర్లపై యశ్వంత్ ములుకుట్ల నిర్మించారు. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించగా శ్రావణ్ భరద్వాజ్ సంగీతం సమకూర్చారు. రాజా చెంబోలు, హర్ష ఇతర పాత్రలు పోషించారు. రీసెంటుగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంది. సిటీలోని అమ్మాయి.. పల్లెటూరి నుండి సిటీకి వచ్చిన పెళ్లీడు దాటిపోయిన అబ్బాయి మధ్య ప్రేమ ఎలా పుట్టిందనే కథాంశంతో ఈ మూవీ రూపొందింది. ఎట్టకేలకు ఈ సినిమా బయటకి వస్తుందని అనుకుంటున్న సమయంలో ఈ సినిమాకి అనుకోని అవాంతరాలు ఏర్పడేలా ఉన్నాయి.
'భానుమతి రామకృష్ణ' సినిమాకు అలనాటి నటి రచయిత దర్శకురాలు భానుమతి ఫ్యామిలీ సభ్యుల నుండి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయట. టైటిల్ లో భానుమతి రామకృష్ణ పేరు ఉపయోగించినందుకు సినిమా రిలీజ్ ఆపాల్సిందే అంటూ వారు కోరుతున్నారు. అయితే సినిమా దర్శక నిర్మాతలు మాత్రం అందులో హీరోయిన్ పాత్ర పేరు భానుమతి అందుకే ఆ టైటిల్ పెట్టామని.. టైటిల్ మినహా మరే సంబంధం లేదని.. ఆమెను కించ పరిచే సన్నివేశాలు అసలే లేవని చెబుతున్నారు. అంతేకాకుండా కావాలంటే మీకు సినిమా చూపిస్తామని.. సినిమా చూసిన తర్వాత వాళ్ల నిర్ణయం మారుతుందని చిత్ర యూనిట్ అంటున్నారు. కానీ భానుమతి ఫ్యామిలీ మాత్రం సినిమా టైటిల్ లో భానుమతి పేరు తీసేయాల్సిందేనని లేకపోతే కోర్టుకు వెళ్తామని హెచ్చరిస్తున్నారట.
సినిమా రిలీజ్ ముందు ఇలాంటి గొడవలు సహజమే కాని ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాకు ఇలాంటి సమస్యలు రావడం చూస్తే ఆశ్చర్యమేస్తుందని ఇండస్ట్రీ వారాల్లో అనుకుంటున్నారు. అయినా సినిమాల విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయని అంటూ కంప్లైంట్ చేయడం ఇదీమీ మొదటిసారి కాదు. స్టోరీ నేపథ్యం విషయంలోనే.. టైటిల్ విషయంలోనో.. పాత్రల విషయంలోనే.. పాత్రధారి పేరు విషయంలోనో.. చిత్రీకరణ ప్లేస్ విషయంలోనే ఇలా ఏదొక విషయంలో మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆరోపిస్తూ వస్తుంటారు. మరి రాబోయే రోజుల్లో సినిమా వారు క్లాప్ కొట్టాలన్నా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటాయో అని ఆలోచించే పరిస్థితి వస్తుందేమో...!