బేతాళుడు టీం మరో సంచలనం

Update: 2016-11-30 11:05 GMT
సినిమా విడుదలకు ముందు టీజర్.. ట్రైలర్ రిలీజ్ చేస్తారు.. మేకింగ్ వీడియోలు వదులుతారు. సాంగ్స్ టీజర్లూ వదులుతారు. కానీ విడుదలకు ముందు 10-15 నిమిషాల నిడివితో సన్నివేశాలు రిలీజ్ చేయడం.. ఫుల్ వీడియో సాంగ్స్ రిలీజ్ చేయడం మాత్రం అరుదైన విషయం. చిన్నా చితకా సినిమాలకైతే ఓకే కానీ.. ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్న సినిమాలకు సంబంధించి ముందే ఇలా వీడియోలు రిలీజ్ చేయడం ఇంతకుముందెన్నడూ చూడలేదు. ఐతే ‘బేతాళుడు’ టీం మాత్రం ఈ విషయంలో డేరింగ్ స్టెప్ తీసుకుంది. విడుదలకు నెల రోజుల ముందే సినిమాలో తొలి పది నిమిషాల ఫుటేజ్ మొత్తం బయటపెట్టేశాడు హీరో కమ్ ప్రొడ్యూసర్ విజయ్ ఆంటోనీ.

తాజాగా మరో ఐదు నిమిషాల ఎపిసోడ్ యూట్యూబ్ లోకి అఫీషియల్ గా రిలీజ్ చేశారు. దీంతో పాటు సినిమాలోని మూడు పాటలకు సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్ లోకి వచ్చేశాయి. అవి సగం సగం పాటలు కూడా కావు. ఫుల్ వీడియో సాంగ్సే రిలీజ్ చేశారు. అందులో ఒకటి హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ గీతం అయితే.. మరొకటి హీరోయిన్ని దూరం చేసుకుని హీరో పడే వేదనలో వచ్చే శాడ్ సాంగ్. మరొకటి ఇంతకుముందే ఫస్ట్ 10 మినిట్స్ వీడియోలో కనిపించే ‘జయలక్ష్మి’ సాంగ్. ‘బేతాళుడు’ ఒక వైవిధ్యమైన సైకలాజికల్ థ్రిల్లర్. దీని ప్రోమోలన్నీ కూడా చాలా డిఫరెంటుగా ఉన్నాయి. ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వం వహించిన ‘బేతాళుడు’ తమిళ.. తెలుగు భాషల్లో ఈ గురువారమే భారీ స్థాయిలో రిలీజవుతోంది.
Full View



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News