• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య మరో అఖండ ప్లాన్స్...

బాలయ్య మరో అఖండ ప్లాన్స్ రివీల్‌..!

By - Tupaki Desk
Update: 2022-06-25 06:30 GMT
నందమూరి కెరీర్‌ బిగ్గెస్ట్‌ సక్సెస్ గా అఖండ సినిమా నిలిచిన విషయం తెల్సిందే. దాదాపుగా రెండు వందల కోట్ల వసూళ్లను సాధించిన అఖండ సినిమా బాలయ్య కెరీర్ కు మళ్లీ బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది. గత కొన్నాళ్లుగా సరైన సక్సెస్ లేక డీలా పడ్డ బాలయ్య కు అఖండ అనేది ఖచ్చితంగా కొండంత బలం ను.. నమ్మకంను ఇచ్చింది అనేది ఇండస్ట్రీ వర్గాల వారు మరియు సినీ విశ్లేషకులు చెబుతున్న మాట.

అఖండ సినిమా ను బాలయ్య అంత సింపుల్ గా వదిలి పెట్టాడు అంటూ ఆ సమయంలోనే చాలా మంది భావించారు. అన్నట్లుగానే బాలయ్య అఖండ సినిమా కు కొనసాగింపు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నాడట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య సూచనతో ఇప్పటికే బోయపాటి శ్రీను అఖండ 2 సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్ మొదలు పెట్టాడట.

అఖండ సినిమాలోని పాత్రలను తీసుకుని పూర్తిగా కొత్త కథతో సినిమాను చేసే విధంగా ప్లాన్‌ చేస్తున్నారట. అఖండ 2 సినిమా కాస్త పొలిటికల్‌ టచ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారని కూడా సమాచారం అందుతోంది. నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ కొట్టడం కోసం అఖండ 2 సినిమాను వినియోగించుకోవాలని భావిస్తున్నాడు అంటూ ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

ఇప్పటికే రెండు సార్లు వరుసగా ఎమ్మెల్యే అయిన బాలకృష్ణ 2024 అసెంబ్లీ ఎన్నికల ముందు అఖండ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు వ్యూహాలు పన్నుతున్నాడు అనేది సమాచారం. ప్రస్తుతం బాలయ్య 107వ సినిమాను గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేస్తున్నాడు. 108వ సినిమా కు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్న విషయం తెల్సిందే.

ప్రస్తుతం కమిట్‌ అయిన రెండు సినిమాల తర్వాత బాలయ్య అఖండ 2 సినిమా పట్టాలు ఎక్కే అవకాశాలు ఉన్నాయి. 109వ సినిమా ను మరో దర్శకుడితో చేసినా కూడా 110 వ సినిమా అయినా బాలయ్య అఖండ 2 గా చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి బాలయ్య పొలిటికల్‌ గా ఉపయోగపడేలా  అఖండ 2 సినిమా ఉండబోతుంది అంటూ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
Tags:    
  • NandhamuriBalaKrishna 
  • Akhanda 
  • Industry 
  • BoyapatiSrinu 
  • MLA 
  • Balayya107 
  • GopichandMalineni 
  • AnilRavipuddi 
  • MovieNews 

Similar News

మంచు కొండల్లో వణుకుతున్న జాన్వీ!

2026-11-05 11:30 GMT

కంబ్యాక్ కోసం శ్రీనువైట్ల ప్రయత్నం ఫలిస్తుందా? 'జార్జ్ క్రిష్'తో నాటి వైభవం సాధ్యమేనా?

2026-11-05 10:30 GMT

స్నేహితుల రియల్ లైఫ్ డ్రామానే సినిమా!

2026-11-05 10:08 GMT

'జైల‌ర్ 3'పై ఊహించని అప్‌డేట్‌.. ఆ ఏడాదే సెట్స్‌పైకి?

2026-11-05 10:01 GMT

దిగ్గజాల సమ్మేళనం: 1986 నాటి అన్న‌గారు ఎన్టీఆర్ విందులో చిరంజీవి!

2026-11-05 10:00 GMT

పెద్ద సినిమాలకు మాత్రమే ఎందుకీ నిర్లక్ష్యం..!

2026-11-05 09:58 GMT

విడుదలకు ముందే కేక పెట్టిస్తున్న కాకా..!

2026-11-05 08:06 GMT

నేచుర‌ల్ అందంతో జెన్ Zని క‌వ్విస్తున్న డెబ్యూ న‌టి

2026-11-05 08:06 GMT

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

Copyright @2026

Powered by Blink CMS