సూపర్ స్టార్ పక్కన ఆలా మిస్ అయ్యింది

Update: 2020-12-14 10:30 GMT
ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న అవికా గౌర్‌ తెలుగులో పలు సినిమాల్లో నటించినా కూడా లక్‌ కలిసి రాక స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకోలేక పోయింది. ఆమద్య కాస్త బరువు ఎక్కువ అవ్వడంతో సినిమా ఆఫర్లు మరింతగా మందగించాయి. దాంతో ఏడాది గ్యాప్‌ తీసుకుని ఈ అమ్మడు మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ఓంకార్‌ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చిన అవికాకు నిరాశే మిగిలింది. తెలుగులో ఆఫర్లు లేని ఈ అమ్మడికి హిందీలో ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా సూపర్‌ స్టార్‌ సల్మాన్ మూవీ అవ్వడంతో ఈ అమ్మడి దశ తిరిగిందని అంతా అనుకున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ కీలక పాత్రలో నటించబోతున్న అంతిమ్‌ అనే సినిమాలో మొదట ఈమెను ఆయుష్‌ శర్మకు జోడీగా ఎంపిక చేయడం జరిగింది. ఇటీవలే ప్రేమ విషయాన్ని బయట పెట్టడం వల్లో లేదా మరే కారణమో కాని అంతిమ్‌ నుండి అవికాను తొలగిస్తున్నట్లుగా ప్రకటన వచ్చేసింది. ఆమె స్థానంలో ఇప్పటికే మహిమ మాక్వాన హీరోయిన్‌ గా ఎంపిక అయ్యింది. సల్మాన్‌ ఖాన్‌ నిర్మిస్తున్న సినిమాలో ఆయన నటిస్తున్న సినిమాలో హీరోయిన్‌ గా నటించే అవకాశం రావడం అంటే మూమూలు విషయం కాదు. ఆ అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోవడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక ఆమె కెరీర్‌ చరమాంకంకు వచ్చినట్లేనా అంటూ కొందరు నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.
Tags:    

Similar News