డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో సమూల మార్పులు చోటు చేసుకోబోతున్నాయా...?
ఒక స్టోరీ లేదా ఒక ఐడియా 'సినిమా'గా మారి బయటకి రావడానికి ఎంతో మంది కృషి ఉంటుంది. ఇన్ని వ్యయ ప్రయాసలు పడి రూపొందిన ఆ సినిమా రిజల్ట్ పై నటీనటులు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇలా అందరి జీవితాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఆ సినిమా ఫలితాన్ని అంతిమంగా నిర్ణయించేది సినీ ప్రేక్షకుడే అయినప్పటికీ.. ప్రేక్షకుడికి ఆ సినిమాని బిగ్ స్క్రీన్ పై చూపించడానికి బయ్యర్లు ఎక్సిబిటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ సంధానకర్తలుగా వ్యవహరిస్తుంటారు. అయితే అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ నష్టాల్లోకి మరింతగా వెళ్లిపోవడానికి డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో అవకతవకలే కారణమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు విషయమేమిటంటే.. ఓ నిర్మాత సినిమా తీసి లాభాలకి అమ్ముకోవడానికి ఓ రేటు చెబుతాడు. ఆ నంబర్ నచ్చితే డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పెట్టి సినిమాని తీసుకుంటాడు. అయితే అప్పుడప్పుడు డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో ఉన్న పోటీ కారణంగా సదరు నిర్మాత చెప్పిన ధర కంటే ఎక్కువ ఇచ్చి కొనుక్కుపోవడానికి డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడుతుంటారు. ఈ పరిణమాలు ఎక్కువగా ఎవరైనా స్టార్ హీరోల సినిమాల విషయంలో జరుగుతుంటాయి. ఇలా చెప్పిన దానికంటే ఎక్కువ రేటుకి కొనుకున్న డిస్ట్రిబ్యూటర్లు ఆ సినిమా ఆడితే అతి స్వల్ప లాభాలతో బయటపడతారు.. ఒకవేళ సినిమా సరిగ్గా ఆడకపోతే మాత్రం ఇక అంతే సంగతులు. అయితే ఈ ట్రేడ్ మొత్తం పేపర్లు వరకే పరిమితమవుతుంది.
వాస్తవానికి ప్రొడ్యూసర్ కి డిస్ట్రిబ్యూటర్లు కేవలం వారు చెప్పిన అమోంట్ లో 70 శాతం మాత్రమే ఇస్తారట.. మిగతా డబ్బులు సినిమా రిలీజ్ తరువాత అన్నట్లుగా ఓ మాట అనుకొని సినిమాలు తీసుకెళ్తుంటారట. అయితే ఇందులో చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు సినిమా రన్ బాగున్నా అనేక సాకులు చెప్పి నిర్మాతకి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు ఇవ్వకుండా తిప్పుతూ ఉంటారట. కాగా వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో మార్పులు రావాలని ట్రేడ్ పండితులు చెప్తున్నారు. ఓ హీరోకి సంబంధించిన హిట్లు ఫ్లాపులను యావరేజ్ వేసుకొని మాత్రమే ప్రొడ్యూసర్ దగ్గర సినిమాలు కొనుక్కోవాలని.. అలానే ఎగ్జిబిటర్లు దగ్గర కూడా ఆన్ లైన్ బుకింగ్స్ పెట్టాలని.. అలానే డిజిటల్ మనీ రూపంలో ట్రేడ్ జరగాలని వారు సూచిస్తున్నారు. ఇలా అయితే తప్ప డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థలో సమస్యలు తీరవని అంటున్నారు. అయితే బాలీవుడ్ లో అసలు ఇలాంటి సమస్యలు కనిపించవు. అందుకే అక్కడ ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ తో పాటు థియేటర్ వ్యవస్థ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు సాగుతుంది. ఇక పక్క ఇండస్ట్రీలైన తమిళ్, మళయాలం, కన్నడలలో కూడా డిస్ట్రిబ్యూటర్ల వ్యవస్థని సరిచేయడానికి పూనుకుంటున్నారట. మరి టాలీవుడ్ లో కూడా ఆ దిశగా అడుగులు వేస్తారేమో చూడాలి.