`ర‌మ్`ని కోల్పోయాను `విస్కీ` ఉంది!

Update: 2020-06-17 10:50 GMT
క్యూట్ బ్యూటీ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ గ‌త కొంత‌కాలంగా టాలీవుడ్ స‌ర్కిల్స్ నుంచి మిస్స‌యిన సంగ‌తి తెలిసిందే. సోష‌ల్ మీడియాల్లోనూ ఏమంత సంద‌డి క‌నిపించ‌లేదు. అయితే దీనికి కార‌ణ‌మేమిటి? ఇంత‌కీ అనుప‌మ ఏమైంది? అన్న‌ది ఆరా తీస్తే.. ఉన్న‌ట్టుండి త‌నే తిరిగి ఓ వీడియో తో జ‌వాబిచ్చే ప్ర‌య‌త్నం చేసింది.

త‌న జీవితంలో ఎంతో కీల‌క‌మైన ఇద్ద‌రిని కోల్పోయాన‌ని అనుప‌మ ఆవేద‌న‌ను వ్య‌క్తం చేసింది. అయిన‌వాళ్ల‌ను పోగొట్టుకుంటే ఆ వ్య‌థ ఎలా ఉంటుందో అర్థం చేసుకోగ‌లం. ఇంత‌కీ ఆ ఇద్ద‌రు ఎవ‌రు? అంటే.. రెండు పెంపుడు కుక్కలు పార్వో వైర‌స్ అనే అరుదైన వైర‌స్ సోకి చ‌నిపోయాయ‌ట‌. ఈ వైర‌స్ గురించి ఇంత‌కుముందు ఎన్న‌డూ విన‌లేద‌ని కుక్క‌ల్ని కోల్పోయాకే తెలిసింద‌ని వాపోయింది. ర‌మ్ .. టాడీ అనే రెండు పెంపుడు కుక్క‌లు వైర‌స్ భారిన ప‌డి చ‌నిపోయాయ‌ని తెలిపింది. అయితే ఇప్పుడు విస్కీ త‌న‌తో ఉందిట‌. విస్కీ అంటే త‌న ఇంట్లో మూడో కుక్క పిల్ల‌.

జూన్ ఎనిమిది నుంచి ఈ సంగ‌తిని చెప్పాలనే ప్ర‌య‌త్నిస్తున్నాను. కానీ నిరాశ‌కు గురై నొప్పిని భ‌రించ‌లేక‌పోయాను. నా అబ్బాయిల‌ను కాపాడుకోలేక‌పోయాను. ఇలా మ‌రెవ‌రికీ జ‌ర‌గ‌కూడ‌దు! అంటూ తీవ్రంగా క‌ల‌త‌కు గురైంది అనుప‌మ‌. పార్వో వైర‌స్ మ‌నుషుల్ని ఏమీ చేయ‌దు కానీ కుక్క‌ల్ని మాత్రం దీని బారిన ప‌డ‌కుండా కాపాడుకోవాల‌ని అనుప‌మ కోరింది. కెరీర్ సంగ‌తి చూస్తే.. రాక్ష‌సుడు తర్వాత తెలుగులో సినిమాల్లేవ్. రామ్ .. సాయిధ‌ర‌మ్ మ‌ళ్లీ ఆఫ‌ర్స్ ఇస్తార‌నే భావించినా రాలేదు. ప్ర‌స్తుతం త‌మిళంలో త‌ల్లి పోగ‌తే అనే చిత్రంలో.. మ‌ల‌యాళంలో మ‌నియార‌యిలే అనే చిత్రంలోనూ న‌టిస్తోంది.
Tags:    

Similar News