ఆ బోల్డ్ క్యారెక్టర్ ఒప్పుకొని పెద్ద తప్పు చేశాను : రష్మీ
రష్మీ గౌతమ్.. బుల్లితెర పై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీకి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ ఉంది. అప్పటికే సుమ అనసూయ లాంటి వాళ్లు యాంకర్స్ గా రాణిస్తున్న తరుణంలో యాంకర్ గా అడుగుపెట్టింది రష్మీ. బుల్లితెరకు గ్లామర్ ను అద్దిన యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరని చెప్పవచ్చు. యాంకరింగ్ చేయడంలో తనకంటూ ఓ ప్రత్యేకత ఉందని నిరూపించుకున్న ఈమె.. పలు బుల్లితెర కార్యక్రమాల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ గ్లామర్ ఒలకబోస్తోంది. అందాలు ఆరబోస్తూ యాంకరింగ్ చేస్తూ కొత్త ఒరవడిని సృష్టించడం మొదలుపెట్టింది. గత కొన్నేళ్లుగా రష్మీ తన మ్యాజిక్ ను చూపిస్తూ ఎవర్ గ్రీన్ యాంకర్ లా రాణిస్తూనే ఉంది. వాస్తవానికి రష్మీ మొదట వెండితెరపై చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. కానీ సిల్వర్ స్క్రీన్ మీద సక్సెస్ కాలేకపోయింది. ఆ తర్వాత ‘గుంటూరు టాకీస్’ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఈ మూవీలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ యూత్ ఆడియన్స్ అందరినీ బుట్టలో వేసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ అది వర్కవుట్ కాలేదు. సినిమాల్లో సక్సెస్ కాకపోయినప్పటికీ బుల్లితెరపై తన హవా చూపిస్తోంది రష్మీ. అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తాను సినిమాల్లో సక్సెస్ కాకపోవడానికి గల కారణాలు చెప్పింది రష్మీ.
రష్మీ మాట్లాడుతూ.. బుల్లితెరపై నాకున్న క్రేజ్ వెండితెరపై అవకాశాలను తెచ్చిపెట్టింది. దాంతో ఒక్కో సినిమా చేస్తూ వెళ్లాను. ఈ క్రమంలోనే 'గుంటూరు టాకీస్' సినిమా చేశాను. ఆ సినిమాలో నేను గ్లామర్ డోస్ పెంచేస్తూ కనిపించడం చూసి అభిమానులు షాక్ అయ్యారు. ఆ సినిమా తరువాత నుంచి నాకు అదే తరహా పాత్రలు రావడం మొదలుపెట్టాయి. దర్శక నిర్మాతలు నేను అలాంటి పాత్రలే చేయగలనని అలాంటి రోల్స్ ఆఫర్ చేస్తున్నారని.. దీంతో అదే తరహా రోల్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని.. వైవిధ్యభరితమైన పాత్రలను చేయాలనే తన ఆశ నిరాశ గానే మిగిలిపోయిందని రష్మీ చెప్పుకొచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ పాత్రను ఒప్పుకుని చాలా పొరపాటు చేశాననే చెప్పాలి. ఇకపై అలాంటి పాత్రలను ఎలాంటి పరిస్థితుల్లోను ఒప్పుకోనని చెప్పింది. మరి ఇకనైనా రష్మీకి కోరుకున్న రోల్స్ వచ్చి ఆమె కోరిక తీరుతుందా అనేది చూడాలి.