విష్ణు విన్యాసంపై అంచ‌నాల్ని పెంచుతున్న క‌న్ఫ్యూజ‌న్ సాంగ్

ఇక సాంగ్ లో శ్రీ విష్ణు ఎక్స్‌ప్రెష‌న్స్, అత‌ని డాన్సుల్లో ఈజ్, అలాగే అతని నేచుర‌ల్ యాక్టింగ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాయి.;

Update: 2026-02-24 07:50 GMT

ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలతో ఆడియ‌న్స్ ను అలరిస్తూ వరుస స‌క్సెస్‌లు అందుకుంటున్న హీరో శ్రీ విష్ణు మరోసారి పూర్తి స్థాయి వినోదంతో రాబోతున్నారు. ఆయన తాజా సినిమా విష్ణు విన్యాసం ఇప్పటికే మంచి అంచనాల‌ను సొంతం చేసుకుంది. ఆల్రెడీ రిలీజైన రెండు సాంగ్స్, టీజ‌ర్ ఆడియ‌న్స్ లో సినిమాపై ఉన్న ఆస‌క్తిని పెంచేయ‌గా, తాజాగా రిలీజైన క‌న్ఫ్యూజ‌న్ సాంగ్ సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఈ సాంగ్ ను చిత్ర యూనిట్ బ్రేక‌ప్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా ప్రమోట్ చేస్తోంది.

యూత్ కు రిలేట్ అయ్యే లిరిక్స్

ఈ సాంగ్ ను మ్యూజిక్ డైరెక్ట‌ర్ రాధ‌న్ త‌నదైన శైలిలో ఎన‌ర్జిటిక్ బీట్స్ తో కంపోజ్ చేయ‌గా, సాంగ్ విన‌గానే యూత్ కు వెంటనే కనెక్ట్ అయ్యేలా రూపొందింది. శ‌ర‌త్ సంతోష్ ఈ సాంగ్ ను తన గొంతుతో మ‌రింత స్పెష‌ల్ గా మార్చ‌గా, బ్రేక‌ప్ వ‌ల్లే క‌లిగే బాధ, ప్రేమలో తలెత్తే గందరగోళం, ఊహించ‌ని విధంగా ప్రవర్తించే ప్రేయసి వల్ల కలిగే కన్ఫ్యూజన్‌ను స‌ర‌దాగా తెలియ‌ప‌రిచేలా రామ‌జోగ‌య్య శాస్తి సాహిత్యాన్నిఅందించారు. పాట‌లో ఆయన రాసిన‌ పదాలు యూత్‌కు బాగా రిలేట్ అయ్యేలా ఉండటం సాంగ్ కు ప్రధాన బలంగా నిలిచింది.

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యే ఛాన్స్

ఇక సాంగ్ లో శ్రీ విష్ణు ఎక్స్‌ప్రెష‌న్స్, అత‌ని డాన్సుల్లో ఈజ్, అలాగే అతని నేచుర‌ల్ యాక్టింగ్ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ గా నిలిచాయి. బ్రేక‌ప్ బాధను కూడా సరదాగా చూపించిన విధానం ఆడియ‌న్స్ ను ఎంత‌గానో ఆకట్టుకుంటుండ‌గా, సోషల్ మీడియాలో ఈ సాంగ్ పై రీల్స్ భారీగా వస్తాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ క‌న్ఫ్యూజ‌న్ సాంగ్ కథలోని ప్రేమ, సంబంధాల నేపథ్యంపై ఆసక్తిని మరింత పెంచేలా ఉందని చెప్పవచ్చు.

ఫిబ్ర‌వ‌రి 27న విష్ణు విన్యాసం రిలీజ్

ఇక సినిమా విష‌యానికొస్తే య‌దునాధ్ మారుతీరావు ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్టైనర్ గా తెర‌కెక్కింది. విష్ణు విన్యాసంలో రొమాన్స్, కామెడీ, ఎమోష‌న్స్ అన్నీ స‌మ‌పాళ్ల‌లో ఉంటాయ‌ని మేక‌ర్స్ చెప్తున్నారు. న‌య‌న్ సారిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో స‌త్య‌, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించ‌నుండ‌గా, సుమంత్ నాయుడు.జి ఈ సినిమాను బ‌డ్జెట్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ అవ‌కుండా నిర్మించారు. ఫిబ్ర‌వ‌రి 27న విష్ణు విన్యాసం ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. మొత్తానికి క‌న్ఫ్యూజ‌న్ సాంగ్ అనే బ్రేక‌ప్ సాంగ్ తో ఈ సినిమాపై అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. చూస్తుంటే, వ‌రుస హిట్ల‌తో కెరీర్లో దూసుకెళ్తున్న శ్రీ విష్ణు, ఈ సినిమాతో మ‌రో స‌క్సెస్ ను ఖాతాలో వేసుకొవ‌డం ఖాయంలానే అనిపిస్తోంది.


Full View
Tags:    

Similar News