సంక్రాంతి జోష్.. సమ్మర్ కంటిన్యూ చేయడం పక్కానా?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తోపాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, అడివి శేష్, నిఖిల్ సిద్ధార్థ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.;

Update: 2026-02-24 06:36 GMT

టాలీవుడ్ లో సమ్మర్ సీజన్ కూడా గోల్డెన్ టైమ్ గానే భావిస్తారు హీరోలు, దర్శక నిర్మాతలు. ముఖ్యంగా స్కూల్, కాలేజీలకు ఎక్కువ రోజులు సెలవులు ఉండటంతో ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి థియేటర్లకు రావడం, పెద్ద సినిమాలకు భారీ ఓపెనింగ్స్ రావడం వేసవి సీజన్ స్పెషాలిటీ. అందుకే నిర్మాతలు, హీరోలు తమ చిత్రాలను సమ్మర్‌ కు ఏటా ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈసారి సమ్మర్ లో ఓ రేంజ్ లో సినిమాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.

నిజానికి 2026లో ఇప్పటికే సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌ కు మంచి జోష్ ఇచ్చింది. ఐదు సినిమాలు విడుదలై అందులో మూడు హిట్‌ గా నిలవగా, రెండు చిత్రాలు మిక్స్‌ డ్ టాక్ తెచ్చుకున్నాయి. దీంతో ఇండస్ట్రీకి మంచి స్టార్ట్ దక్కింది. బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున వసూళ్లు వచ్చాయి. దీంతో ఇప్పుడు ఆ ఊపును కొనసాగించే బాధ్యత సమ్మర్‌ పై పడింది. ఈ నేపథ్యంలో వరుసగా భారీ సినిమాలు రిలీజ్‌ కు సిద్ధమవుతుండటంతో అందరిలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ముఖ్యంగా స్టార్ హీరోలు సమ్మర్ రేస్‌ లో దిగడం ఈసారి మరింత ఆసక్తి పెరుగుతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఛార్మింగ్ స్టార్ శర్వానంద్ తోపాటు యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోలు శర్వానంద్, అడివి శేష్, నిఖిల్ సిద్ధార్థ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ కొత్త ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వీరి సినిమాలపై ఇప్పటికే మంచి క్రేజ్ ఉండటంతో ఓపెనింగ్స్ భారీగా ఉండే అవకాశముంది.

అయితే సమ్మర్ సీజన్‌ లో విడుదలకు సిద్ధమవుతున్న ప్రధాన చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్, పెద్ది, బైకర్, డెకాయిట్, స్వయంభూ, కొరియన్ కనకరాజు, టైసన్ నాయుడు వంటి పలు మూవీలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. హై బడ్జెట్, కమర్షియల్ ఎలిమెంట్స్, స్టార్ కాస్టింగ్ అన్నీ కలిపి ఆ సినిమాలపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. ఇప్పటికే వచ్చిన ప్రమోషనల్ కంటెంట్.. మంచి రెస్పాన్స్ అందుకోవడం విశేషం.

అదే సమయంలో చిన్న, మీడియం రేంజ్ సినిమాలు కూడా పోటీకి సిద్ధమవుతున్నాయి. కంటెంట్ స్ట్రాంగ్ గా ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో అనేక చిత్రాల నిర్మాతలు సమ్మర్‌ ను టార్గెట్ చేస్తున్నారు. ఇతర భాషల నుంచి వచ్చే డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలవుతుండటంతో బాక్సాఫీస్ వద్ద పోటీ ఆసక్తికరంగా మారనుంది. అందులో యష్ టాక్సిక్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

ఏదేమైనా ఈసారి వేసవి సీజన్ టాలీవుడ్‌ కు భారీ వసూళ్లు కురిపించే సీజన్ గా మారేలా కనిపిస్తోంది. వరుస స్టార్ సినిమాలతో థియేటర్లు మళ్లీ కళకళలాడనుండగా, భారీ కలెక్షన్లు నమోదయ్యే అవకాశాలు క్లియర్ గా కనిపిస్తున్నాయి. దీంతో సమ్మర్ 2026 టాలీవుడ్‌ కు బ్లాక్‌ బస్టర్ సీజన్‌ గా నిలవడం ఖాయమనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మరి చూడాలి వేసవిలో రానున్న సినిమాలు ఎలా ఉంటాయో.. ఎంతలా మెప్పిస్తాయో..

Tags:    

Similar News