అవార్డుల వేడుక.. టాలీవుడ్ సెలబ్రిటీలు అంతలా ఇబ్బందిపడ్డారా?

అంతేకాదు, వేడుక నిర్వహించిన ఏరియాపై కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలుగు సినిమా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్‌ ను సంపాదించుకుని, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది.;

Update: 2026-02-24 07:22 GMT

రీసెంట్ గా జరిగిన ఓ ప్రముఖ సినీ అవార్డుల వేడుక టాలీవుడ్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు, నిర్మాతలు, దర్శకులు హాజరైన ఆ కార్యక్రమం గ్రాండ్ గా జరిగినప్పటికీ.. నిర్వహణలోని కొన్ని లోపాలు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురిచేసినట్లు సమాచారం. ముఖ్యంగా గెస్టుల పట్ల చూపాల్సిన మర్యాద, కొత్తవారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యం విషయంలో నిర్వాహకులు ఫెయిల్ అయ్యారని టాక్.

ఇండస్టీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ప్రముఖ సినీ ఫ్యామిలీకి చెందిన ఓ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఆ వేడుకలో డెబ్యూ ఆర్టిస్టులకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అవార్డు అందుకున్న తర్వాత తమ జర్నీ, థ్యాంక్స్ చెప్పుకునేందుకు టైమ్ కూడా ఇవ్వకపోవడం సరైంది కాదని వ్యాఖ్యానించారట. కొత్త టాలెంట్ ను ప్రోత్సహించాల్సిన వేదికపై వారిని పక్కనపెట్టడం బాధాకరమని, అవార్డు అంటే కేవలం ట్రోఫీ ఇవ్వడం మాత్రమే కాదని, గుర్తింపు ఇవ్వడమూ ముఖ్యమని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో మరో ప్రముఖ నటి కూడా నిర్వాహకుల తీరుపై పరోక్షంగా అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన ఆమె ఎయిర్ పోర్టులో దాదాపు 40 నిమిషాల పాటు రిసీవ్ కోసం వేచి ఉండాల్సి వచ్చిందట. గెస్టుల కోసం సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఇబ్బంది పడ్డానని ఆమె సన్నిహితులతో చెప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద స్థాయి ఈవెంట్‌ కు వచ్చిన అతిథులకు సరైన స్వాగతం, రవాణా సౌకర్యాలు కల్పించకపోవడం నిర్వాహకుల నిర్లక్ష్యమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అంతేకాదు, వేడుక నిర్వహించిన ఏరియాపై కూడా టాలీవుడ్ వర్గాల్లో చర్చ మొదలైంది. ప్రస్తుతం తెలుగు సినిమా దేశవ్యాప్తంగా మంచి మార్కెట్‌ ను సంపాదించుకుని, పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. అలాంటి సమయంలో తెలుగు పరిశ్రమకు సంబంధించిన అవార్డులను వేరే స్టేట్ లో కాకుండా హైదరాబాద్ లో నిర్వహిస్తే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్‌ లో నిర్వహిస్తే ఆర్టిస్టులు, టెక్నీషియన్లు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండేదని చెబుతున్నారు.

ముఖ్యంగా వేరే రాష్ట్రంలో వేడుక పెట్టడం వల్ల పలువురు సెలబ్రిటీలు షెడ్యూల్‌ లను మార్చుకోవాల్సి వచ్చిందని, కొందరు చివరి నిమిషంలో హాజరు కాలేకపోయారనే సమాచారం. దీంతో వేడుకకు రావాల్సిన కొంతమంది ప్రముఖులు అటెండ్ అవ్వలేకపోయినట్లు తెలుస్తోంది. కార్యక్రమం గ్రాండ్ గా జరిగినప్పటికీ.. చిన్న చిన్న లోపాలే పెద్ద చర్చకు దారి తీశాయని చెప్పాలి.

ఏదేమైనా అవార్డుల వేడుకలు ఆర్టిస్టులను గౌరవించే వేదికలు కావాలి గానీ, ఇబ్బందులకు కారణం కావొద్దని అనేక మంది సినీ ప్రియులు, నెటిజన్లు ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. ఫ్యూచర్ లో ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించే సమయంలో ప్రొఫెషనల్ ప్లానింగ్, టైమింగ్, గెస్టుల పట్ల మర్యాద వంటి అంశాలకు ఇంపార్టెన్స్ ఇస్తేనే ప్రశంసలు వస్తాయని సూచిస్తున్నారు. ఇకపై నిర్వాహకులు మరింత జాగ్రత్తలు తీసుకుంటారనే భావిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News