తమ్ముడి పెళ్లి సరే.. మరీ నీ పెళ్లి ఎప్పుడు?
ఇండియన్స్‌కి క్రికెట్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు.;
ఇండియన్స్‌కి క్రికెట్ అనగానే గుర్తుకు వచ్చే పేర్లలో సచిన్ టెండూల్కర్ పేరు ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. 1980, 1990 కిడ్స్ కి సచిన్ అంటే ఒక ఎమోషన్. క్రికెట్ అంటే సచిన్... సచిన్ అంటే క్రికెట్ అన్నట్లు ఉండేది. అలాంటి సచిన్ మెల్ల మెల్లగా ఫేడ్ ఔట్ కావడం కొత్త క్రికెటర్‌లు రావడం జరిగింది. అయినా ఇప్పటికీ చాలా మంది సచిన్ అభిమానులం అని చెప్పుకుంటూ ఉంటారు. సచిన్ గురించి ఏ విషయం సోషల్ మీడియాలో ప్రచారం జరిగినా వైరల్ కావడం మనం చూస్తూ ఉంటాం. ఇక ఆయన ఇద్దరు పిల్లల గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ప్రస్తుతం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహం గురించి సోషల్ మీడియాలో ప్రముఖంగా చర్చ జరుగుతోంది. సచిన్ కూతురు సారా టెండూల్కర్ వివాహం గురించి కూడా ప్రస్తుతం ప్రముఖంగా చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే.
సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ పెళ్లి...
అర్జున్ టెండూల్కర్ కంటే సారా టెండూల్కర్ వయసులో రెండేళ్లు పెద్ద. సాధారణంగా పెద్ద వయసు వారు ముందు పెళ్లి చేసుకుని తర్వాత చిన్న వయసు వారు పెళ్లి చేసుకుంటారు. అంతే కాకుండా ఇంట్లో అబ్బాయి, అమ్మాయి ఉంటే.. వయసుతో సంబంధం లేకుండా మొదట అమ్మాయి పెళ్లి చేసి తర్వాత అబ్బాయి పెళ్లి చేస్తారు. కానీ టెండూల్కర్ మాత్రం రెండు నియమాలను పాటించడం లేదు అంటూ సోషల్ మీడియాలో కొందరు ట్రోల్స్ చేస్తున్నారు. మరి కొందరు సారా టెండూల్కర్‌ను ట్రోల్ చేస్తున్నారు. చాలా ఏళ్ల క్రితమే సారా టెండూల్కర్ ప్రేమలో పడింది. క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ తో ఈమె ప్రేమాయణం గురించి అప్పట్లో ప్రముఖంగా చర్చ జరిగింది. పెద్దల అంగీకారంతో పెళ్లి కూడా జరుగుతుందని అంతా భావించారు. కానీ అది వర్కౌట్ కాలేదు. శుభ్‌మాన్ గిల్ తో బ్రేకప్ తర్వాత సారా మరోసారి ప్రేమలో పడటం అప్పట్లో చర్చనీయాంశం అయింది.
సారా టెండూల్కర్ ప్రేమ వ్యవహారాలు..
గిల్ నుంచి విడిపోయిన కొన్నాళ్లకే సారా టెండూల్కర్ కి బాలీవుడ్ నటుడు సిద్దాంత్ చతుర్వేదికి మధ్య వ్యవహారం ఉందనే పుకార్లు షికార్లు చేశాయి. ఇద్దరూ కలిసి తిరగడం, పేజ్ 3 పార్టీలకు హాజరు కావడం వంటివి ఆ సమయంలో జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ సిద్దాంత్ తో కూడా సారా విడి పోయింది. ప్రస్తుతం సోలో లైఫ్ ను సింగిల్ గానే లీడ్ చేస్తుంది. ఆమె సోషల్ మీడియాలో కొత్తగా యాడ్ అయిన వారు కనిపించడం లేదు. అయితే ఆమె గురించి తెలిసిన వారు మరికొన్ని రోజుల్లోనే ఎవరితోనో ఒకరితో సారా ప్రేమలో పడటం ఖాయం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ పద్దతిగా పెళ్లి చేసుకుంటూ ఉంటే, సారా మాత్రం లవ్.. బ్రేకప్.. లవ్.. బ్రేకప్ అంటూ సచిన్ టెండూల్కర్ పరువు తీస్తోంది అంటూ కొందరు సోషల్ మీడియా ద్వారా ఆమెను తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. ఆ విమర్శలను సారా పెద్దగా పట్టించుకోకుండా తన పని తాను అన్నట్లుగా చేసుకుంటూ వెళ్తుంది.
అర్జున్ టెండూల్కర్, సానియా వివాహం తేదీ..
అర్జున్ పెళ్లికి సంబంధించిన హడావిడి చేస్తున్న సారా ను చాలా మంది తమ్ముడి పెళ్లి సరే నీ పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలోనూ ఆమెను ట్యాగ్ చేస్తూ చాలా మంది అక్క మీ పెళ్లి ఎప్పుడు అన్నట్లుగా ప్రశ్నిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు సారా టెండూల్కర్ మాత్రం పెళ్లి విషయమై నోరు విప్పడం లేదు. అర్జున్ వివాహం మార్చి 5, 2026న ముంబైలో సానియా చందోక్ తో జరుగబోతుంది. సానియా పెండుపు జంతువులకు సంబంధించిన వస్త్రాల బ్రాండ్‌ను నడుపుతోంది. ఆమె తండ్రి ఆటోమొబైల్ వ్యాపారంలో ఉన్నారు. సానియా ఫ్యామిలీ కి పెద్ద వ్యాపార సామ్రాజ్యం ఉందని ముంబై వర్గాల ద్వారా తెలుస్తోంది. అర్జున్ టెండూల్కర్, సానియా సుదీర్ఘ కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారు. అర్జున్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో నిలదొక్కుకోకుండానే పెళ్లి చేసుకోవడంను కొందరు విమర్శిస్తున్నారు. మరికొందరు అక్క పెళ్లి కాకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని అర్జున్ ను సైతం ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటికి సచిన్ టెండూల్కర్ నుంచి సమాధానం రావాల్సి ఉంది.