ఈ హీరోయిన్.. మన స్టార్ హీరో చుట్టమా?

కేరళలోని కొచ్చిలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది.;

Update: 2026-02-24 06:38 GMT

టాలీవుడ్‌లో ఇప్పుడు ఒక కొత్త తెలుగు అమ్మాయి పేరు ట్రెండింగ్ లిస్టులోక్ వచ్చేసింది. రైటర్ పద్మభూషణ్, మ్యాడ్ వంటి సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆ బ్యూటీ, ఇప్పుడు కోలీవుడ్‌లో కూడా సత్తా చాటుతోంది. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం సరసన 'చెన్నై లవ్ స్టోరీ'లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది. దానికి కారణం ఆమె యాక్టింగ్ మాత్రమే కాదు, రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్ లో ఆమె పక్కన ఒక స్టార్ హీరో కనిపించడమే.

కేరళలోని కొచ్చిలో జరిగిన ఫిలింఫేర్ అవార్డ్స్ వేడుకలో ఒక ఆసక్తికరమైన సీన్ కనిపించింది. ఆ ఫోటోలు, వీడియోలు చూస్తుంటే ఈ యంగ్ హీరోయిన్‌కి అల్లు ఫ్యామిలీతో ఏదో చుట్టరికం ఉన్నట్లు అర్థమవుతోంది. అసలు ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? ఇంత సడన్ గా ఆమె ఒక స్టార్ హీరో పక్కన అంత క్లోజ్ గా ఎలా కనిపించింది? అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ హీరోయిన్ గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు.

అసలు విషయం ఏంటంటే, ఆ అవార్డ్ ఫంక్షన్‌లో లెజెండరీ హీరో మమ్ముట్టి పక్కన తెలుగు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ రెడ్డి నిలబడి ఉండగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అక్కడికి వచ్చారు. మమ్ముట్టికి ఆమెను పరిచయం చేస్తూ, "ఈమె నా రిలేటివ్" అని బన్నీ చెప్పడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఒక స్టార్ హీరో స్వయంగా ఆమె తన బంధువు అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీ గౌరి ప్రియ పేరు సెన్సేషన్ అయ్యింది.

అయితే బన్నీ అన్న మాటకు రకరకాల అర్థాలు వెతుకుతున్నారు నెటిజన్లు. ఆమె టాలీవుడ్ అమ్మాయి కాబట్టి మర్యాదపూర్వకంగా అలా అన్నారా? లేక నిజంగానే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డికి ఆమె దగ్గరి చుట్టమా? అనే డౌట్స్ వస్తున్నాయి. అల్లు అర్జున్ భార్య పేరులో కూడా రెడ్డి అని ఉండటంతో, స్నేహ రెడ్డి వైపు నుంచి ఆమెకు బంధుత్వం ఉండవచ్చని చాలా మంది ఫిక్స్ అయిపోతున్నారు. ఏదేమైనా బన్నీ స్వయంగా "రిలేటివ్" అని స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆమె కెరీర్‌కి పెద్ద ప్లస్ పాయింట్ అవ్వబోతోంది.

ఇప్పటికే తన నటనతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న శ్రీ గౌరి ప్రియకి, ఇప్పుడు ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా తోడయ్యేలా ఉంది. ఒక యంగ్ హీరోయిన్ కి ఇంత పెద్ద స్టార్ సపోర్ట్ ఉండడం అంటే అది మామూలు విషయం కాదు. అల్లు అర్జున్ తో ఉన్న ఈ బంధంతో ఆమెకు మరిన్ని భారీ ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు అమ్మాయిలకు ఛాన్సులు రావు అనే మాటను ఈమె తిరగరాస్తున్నట్లు కనిపిస్తోంది.

ఏదేమైనా శ్రీ గౌరి ప్రియ రెడ్డి వెనుక ఉన్న ఈ చుట్టరికం మిస్టరీ త్వరలోనే పూర్తిస్థాయిలో రివీల్ అయ్యే ఛాన్స్ ఉంది. బన్నీ అంత కాన్ఫిడెంట్‌గా పరిచయం చేశారంటే దగ్గరి బంధుత్వమే ఉన్నట్లు అర్థమవుతోంది. కిరణ్ అబ్బవరం సినిమాతో పాటు ఆమె చేయబోయే నెక్స్ట్ సినిమాలు ఏ రేంజ్ లో సక్సెస్ అవుతాయో చూడాలి. మరి ఈ క్రేజీ రిలేషన్ గురించి శ్రీ గౌరి ప్రియ ఏమైనా క్లారిటీ ఇస్తుందేమో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News