క్షణం.. అక్కడ కూడా అనసూయే

Update: 2016-10-22 09:30 GMT
లోబడ్జెట్ లో వచ్చిన కాన్సెప్ట్ మూవీ క్షణం.. టాలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ సాధించింది. సినిమా థీమ్ నుంచి.. రవికాంత్ పెరెపు డైరెక్షన్.. ఆదాశర్మ యాక్టింగ్.. అనసూయ ట్యాలెంట్.. అన్నిటికీ మించి అడివి శేష్ నటన ఈ చిత్రాన్ని సక్సెస్ తీరాలు దాటించేసింది. ఇప్పుడీ మూవీ తమిళ్ లోకి రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైంది.

శిబి సత్యరాజ్ హీరోగా కోలీవుడ్ క్షణం రూపొందనుంది. ‍ఒరిజినల్ లో నటించిన ఫిమేల్ లీడ్స్ విషయంలో చాలానే సెర్చింగ్ జరిగినా.. చివరకు లీడ్ రోల్ విషయంలో ఆదాశర్మకే ఓటేశాడు హీరో. ఇక అనసూయ పోషించిన పోలీస్ పాత్రను వేరే ఎవరితోనే మ్యాచ్ చేయడం సాధ్యం కాకపోవడంతో.. చివరకు ఆమెకే మొగ్గారు. తమిళ్ క్షణంలో కూడా తన రోల్ ని అనసూయే చేస్తోంది. ఈమేరకు ఇప్పటికే ఫైనల్ డెసిషన్ అయిపోగా..  తమిళ్ అరంగేట్రం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది అనసూయ.

తెలుగు క్షణంతో పోల్చితే తమిళ్ లో మరింతగా తన కేరక్టర్ కోసం అనసూయ రెడీ అయిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంచెం స్లిమ్ అయేందుకు వీలుగా వర్కవుట్స్ కూడా స్టార్ట్ చేసిందట కూడా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News