బాగా అప్సెట్ అయిన అనసూయ!!

Update: 2018-10-19 06:20 GMT
బుల్లితెర పైనే కాకుండా 'క్షణం'.. 'రంగస్థలం' సినిమాలలో తన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన అనసూయ భరద్వాజ్ తాజాగా 'కథనం' అనే సినిమాతో మన ముందుకు రానుంది.   అనసూయ లీడ్ యాక్టర్ గా నటించిన ఈ సిన్నిమా ఫస్ట్ లుక్ ను నిన్నే విజయదశమి సందర్భంగా ఫిలిం యూనిట్ విడుదల చేసింది.  సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

కానీ ఒక విషయంలో మాత్రం అనసూయ బాగా అప్ సెట్ అయినట్టుంది.  'కథనం' సినిమాను ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అని .. లేడీ ఓరియెంటెడ్ సినిమా అని అనే పేర్లతో పిలవడం తనకు ఏమాత్రం నచ్చలేదట. "ఏదైనా మేల్ యాక్టర్ మెయిన్ రోల్ లో ఉన్న సినిమాను మేల్ ఓరియెంటెడ్ సినిమా అని ఒక్కరు కూడా పిలవరని అదే గనుక ఒక ఫిమేల్ యాక్టర్ లీడ్ రోల్ చేస్తే అందరూ ఎందుకు ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అంటారు?" అని ప్రశ్నించింది.

"అందరూ యాక్టర్లు చేసే పాత్రలు వేటికవే ప్రత్యేకం.. ప్రతి పాత్ర.. అది మేల్ క్యారెక్టర్ అయినా అయిన ఫిమేల్ అయినా సినిమాలో ప్రాముఖ్యత ఉంటుంది.  అందుకే నా ఉద్దేశంలో ఎవరి సినిమా గురించి అయినా ప్రస్తావించే సమయంలో 'ఫలానా వారు లీడ్ రోల్ లో  నటించిన' అని అంటే సరిపోతుంది.  న్యాయంగా అనిపించడం లేదా" అంటూ ట్విట్టర్ లో తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టింది.   విన్నాం.. రంగమ్మత్తా.. అందుకే ఈ ఆర్టికల్ మొదట్లో నువ్వు చెప్పినట్టు చేశాం.

కొసమెరుపు ఏంటంటే మరో బుల్లి తెర బ్యూటీ.. రష్మి మాత్రం 'కథనం' ఫస్ట్ లుక్ ను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి అనసూయకు శుభాకాంక్షలు తెలుపుతూ 'వుమన్ సెంట్రిక్ ఫిలిమ్స్ వర్దిల్లాలి' అని ట్వీటింది.
Tags:    

Similar News