బ‌న్ని స‌ర‌స‌న రిపీట‌వుతున్న క్రేజీ బ్యూటీస్

Update: 2021-08-12 06:08 GMT
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో 20పైగా సినిమాల్లో న‌టించారు. రెండు ద‌శాబ్ధాల కెరీర్ లో అత‌డు ఇప్ప‌టివ‌ర‌కూ పూజా హెగ్డేకి త‌ప్ప‌ రిపీటెడ్ గా ఒకే హీరోయిన్ కి అవ‌కాశం ఇచ్చింది లేదు. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లు త‌మ‌న్నా- కాజ‌ల్- ఇలియానా- కేథ‌రిన్ - స‌మంత‌- శ్రుతిహాస‌న్ లాంటి నాయిక‌ల‌కు తిరిగి రెండో అవ‌కాశం లేదు. ఎవ‌డు చిత్రంలో అతిథిగా న‌టించిన శ్రుతికి మాత్రం `రేసుగుర్రం`లో అవ‌కాశం ద‌క్కింది. ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో అత‌డితో అరుదైన అవ‌కాశాన్ని అందుకుంటోంది ర‌ష్మిక మంద‌న‌.

రష్మిక మందన్న ప్రస్తుతం తెలుగు-హిందీ భాష‌ల్లో క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ తన కెరీర్ లో అత్యున్నత దశలో ఉంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప డ్యూయాల‌జీలోనూ ర‌ష్మిక క‌థానాయిక‌. అల్లు అర్జున్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. పుష్ప రెండు భాగాలుగా రూపొందుతుండ‌గా రెండు భాగాల్లోనూ త‌న‌కు ఆఫ‌ర్ లభించింది. ఆస‌క్తిక‌రంగా ఈ మిడిల్ లోనే తెర‌కెక్క‌నున్న‌ ఐక‌న్ మూవీలో బ‌న్ని స‌ర‌స‌న న‌టించే ల‌క్కీ ఛాన్స్ ర‌ష్మిక ద‌క్కించుకుంది. అంటే బ‌న్ని ఒకే హీరోయిన్ తో మూడు సినిమాలు చేస్తున్న‌ట్టే లెక్క‌. అలాంటి అరుదైన అవ‌కాశం రష్మిక‌కు మాత్ర‌మే ద‌క్కుతోంది. ప్రస్తుతం పుష్ప‌1 చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతోంది. ఈ సినిమా రిలీజ‌య్యాక సెకండ్ పార్ట్ కి ముందు బ‌న్ని ఐక‌న్ చిత్రంలో న‌టిస్తారు. శ్రీరామ్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడు న‌టీన‌టుల‌ను ఫైన‌ల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఇద్దరు క‌థానాయిక‌లు న‌టిస్తారని తెలుస్తోంది. ద‌ర్శ‌క‌నిర్మాత‌లు రష్మిక-పూజా హెగ్డేలను ఎంపిక చేయాల‌ని భావిస్తున్నారు.

ఒక‌వేళ పూజా కూడా ఓకే అయితే బ‌న్నితో మూడోసారి అవ‌కాశం అందుకుంటున్న‌ట్టు. దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ త‌ర్వాత అల వైకుంఠ‌పుర‌ములో ఛాన్స్ అందుకున్న పూజాకి ఇప్పుడు మూడో అవ‌కాశం ద‌క్క‌నుంది. త్వరలో స‌ద‌రు భామ‌ల‌తో చర్చలు సాగ‌నున్నాయ‌ని తెలుస్తోంది. పుష్ప లానే.. ఐకాన్ కూడా పాన్ ఇండియా కేట‌గిరీలో విడుదల కానుంది.




Tags:    

Similar News